Bigg Boss 17: రాజాసింగ్‌ విమర్శించిన వ్యక్తికి బిగ్ బాస్ టైటిల్‌.. విజేతగా నిలిచిన స్టాండ్‌అప్‌ కమెడియన్‌!

హిందీ 'బిగ్ బాస్' 17వ సీజన్ విజేతను ప్రకటించారు. స్టాండ్‌అప్‌ కమెడియన్‌ మునావర్ ఫరూఖీ ట్రోఫీని గెలుచుకున్నాడు. అభిషేక్ కుమార్ షో రన్నరప్‌గా నిలిచాడు. గతంలో మునావర్‌ హైదరాబాద్‌లో కమెడి షో చేయడానికి వచ్చినప్పుడు అతని షోని ఆపేందుకు ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రయత్నించారు.

New Update
Bigg Boss 17: రాజాసింగ్‌ విమర్శించిన వ్యక్తికి బిగ్ బాస్ టైటిల్‌.. విజేతగా నిలిచిన స్టాండ్‌అప్‌ కమెడియన్‌!

Munawar Faruqui wins Bigg Boss 17 : హిందీ బిగ్ బాస్-17(Hindi Bigg Boss 17) వ సీజన్ ఫైనల్ చాలా ఉత్సాహంగా జరిగింది. మునావర్ ఫరూఖీ(Munawar Faruqui), అభిషేక్ కుమార్ టాప్-2కు చేరుకున్నారు. చివరకు స్టాండ్-అప్ కమెడియనే(Stand-up Comedian) గెలిచాడు. సల్మాన్ ఖాన్(Salman Khan) మునావర్‌ ఫరూఖీ చేయి పైకెత్తి అతడిని విజేతగా ప్రకటించాడు. బిగ్ బాస్-17 విజేతగా మునావర్ ట్రోఫీని గెలుచుకున్నాడు. అతనికి రూ. 50 లక్షల ప్రైజ్ మనీ, హ్యుందాయ్ క్రెటా కారు అందించారు. బిగ్‌ బాస్‌ హౌస్‌లో మునావర్‌ ప్రారంభ ప్రయాణం అద్భుతమైనదిగా చెబుతుంటారు అతని మద్దతుదారులు. మనారా చోప్రా, రింకూ, జిగ్నాతో అతని స్నేహం చాలా చర్చనీయాంశమైంది. ఈ స్నేహం కారణంగా చాలా గొడవలు కూడా జరిగాయి. మనారాతో అతని స్నేహంపై కూడా ప్రశ్నలు తలెత్తాయి.


అండగా నిలబడ్డ అభిమానులు:
అయేషా ఖాన్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సీన్‌ మారింది. తాను మునావర్‌ గర్ల్‌ఫ్రెండ్ అని, అతను తన వ్యక్తిగత జీవితం గురించి షోలో అబద్ధాలు చెబుతున్నాడని ఆయేషా చెప్పుకొచ్చింది. మునావర్‌ తనను మోసం చేశాడని ఆయేషా చెప్పింది. ఈ ఆరోపణలతో కుంగిపోయిన మునావర్‌ సారీ చెప్పాడు. అతను షోలో పలుమార్లు వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించాడు. తన తప్పులకు క్షమాపణలు కోరుతూ తరచూ కనిపించాడు. తనను క్షమించమని ఆయేషాకు విజ్ఞప్తి చేయడం కూడా కనిపించింది. ఈ మొత్తం ప్రయాణంలో అభిమానులు మునావర్‌కు అండగా నిలిచారు. లక్షలాది మంది అభిమానులు అతనికి అండగా నిలబడ్డారు. ఫ్యాన్స్‌ ప్రేమ ఫలితమే అతను టాప్ కంటెస్టెంట్‌లలో ఉండి బిగ్ బాస్ ట్రోఫీని గెలుచుకున్నాడు. మునావర్‌ ఇంతకు ముందు లాక్ అప్ రియాలిటీ షో విజేతగా నిలిచాడు.


రాజాసింగ్‌ ఎపిసోడ్‌ గుర్తుందా?
మునావర్‌ ఫరూఖీ తెలుగువారికి సుపరిచితమే. అతను స్టాండ్‌-అప్ కమిడియన్‌. ఓ సారి మునవార్‌ ఫరూఖీ తన షో ఇచ్చేందుకు హైదరాబాద్‌(Hyderabad) కు రావాల్సి ఉంది. ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌(BJP MLA Raja Singh) (గోషామహల్‌) ఈ షోను గట్టిగా వ్యతిరేకించాడు. మునావర్ ఫరూఖీ రాముడు, సీతను లక్ష్యంగా చేసుకుని హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. నిజానికి వివిధ రాష్ట్రాల్లో మునావర్‌ షోలు ఆ మధ్య రద్దు చేశారు. 2022 ఆగస్టులో ఫరూఖీ ప్రదర్శన నిర్వహించిన శిల్పకళా వేదిక వద్ద సెట్‌ను తగలబెట్టేందుకు వెళుతున్న రాజా సింగ్‌ను నగర పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం అప్పట్లో టాక్‌ ఆఫ్‌ ది సిటీగా మారింది.

Also Read: ఉదయాన్నే నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి!
WATCH:

Advertisment
తాజా కథనాలు