Mumbai: ఆకాశాన్నంటుతున్న ముంబైలో స్టార్ హోటళ్ళ ధరలు..అనంత్ అంబానీ పెళ్ళే కారణం

మరో 3 రోజుల్లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల పెళ్ళి జరగనుంది. ఈ సందర్భంగా జూన్ 29 నుంచి ముఖేష్ అంబానీ ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ముంబై స్టార్ హోటళ్ళు అన్నీ ఫుల్ అయిపోతున్నాయి. ఈ కారణంగా అక్కడ హోటల్స్ అన్నీ విపరీతంగా రేట్లను పెంచేశాయి.

Ambani's Wedding: కొత్త దంపతులకు కోట్ల విలువైన బహుమతులు
New Update

Ananth Ambani Wedding: ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్ళి అత్యంత జరుగుతోంది. ప్రతీ చిన్న వేడుకను గ్రాండ్ గా చేస్తున్నారు అంబానీ దంపతులు. జూలై 12న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌లో ఒక్కటవ్వబోతున్నారు. ముంబై జియో కన్వెన్షన్‌లో ఈ వివాహం జరగబోతోంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా సినీ, రాజకీయ, వీవీఐపీలు రానున్నారు. దీని కోసం ముంబైలో స్టార్ హోటల్స్ అన్నీ బుక్ అయిపోయాయి. దీన్ని ఆసరాగా చేసుకుని హోటల్ యజమానులు కూడా రేట్లను అమాంతంగా పెంచేస్తున్నారు. ఒక్క రాత్రి స్టేకు సుమారు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్సులో ఉన్న ట్రైడెంట్‌, ఒబెరాయ్‌ హోటళ్ల్ళల్లో జులై 10 నుంచి 14 వరకు గదులు ఖాళీగా లేవు. వీటితో పాటూ ఆ చుట్టుపక్కల ఉన్న హోటళ్లలో రేట్లు కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి. QGతకు ముందు ఒక్కరాత్రి బస చేసేందుకు రూ.13 వేల నుంచి రూ.30 వేలుగా ఉండగా.. జులై 14న రూ.40 వేలు చూపిస్తోంది. మరో హోటల్‌లో 14న ఏకంగా రూ.90వేలకు పైగా ఉన్నట్లు సమాచారం. పన్నులు కలిపి ఇది మరింత పెరుగుతుంది. జులై 10, 11 తేదీల్లో మాత్రం ఖాళీగా లేవు.

అనంత్ అంబానీ , రాధికా మర్చంట్ పెళ్ళి జూలై12న జరగనుంది. దాని తరువాత కూడా పలు కార్యక్రమాలు నిర్వహించున్నారు. జూలై 14వరకు ఇవి జరగనున్నాయి. జులై 13న ‘శుభ్‌ ఆశీర్వాద్‌’, 14న మంగళ్‌ ఉత్సవ్‌ లేదా రిసెప్షన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వైపు వెళ్లే మార్గాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు ముంబై ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు. జులై 12 నుంచి 15 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.

#wedding #mumbai #ananth-mabani #radhika-marchent #star-hotels
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe