Kangana Ranaut: కంగనా రనౌత్ ప్రేమలో పడిందా? ఆమెతో చేతులు కలిపి నడుస్తున్న మిస్టరీ మ్యాన్‌ ఎవరు?

ముంబైలోని ఓ సెలూన్ నుంచి కంగనా ఓ వ్యక్తితో బయటకు వచ్చింది. ఒకరి చేతులు మరొకరు గట్టిగా పట్టుకుని ఇద్దరూ కలిసి సెలూన్ నుంచి బయటకు వచ్చారు. ఆమెతో పాటు కనిపించిన మిస్టరీ మ్యాన్ ఎవరని నెటిజన్లు ఆరాతీస్తున్నారు. కంగనా ప్రేమలో పడిందా అని కామెంట్స్ చేస్తున్నారు.

New Update
Kangana Ranaut: కంగనా రనౌత్ ప్రేమలో పడిందా? ఆమెతో చేతులు కలిపి నడుస్తున్న మిస్టరీ మ్యాన్‌ ఎవరు?

Kangana Ranaut: బాలీవుడ్ 'క్వీన్' స్టార్ కంగనా రనౌత్ నిత్యం వార్తల్లో ఉంటుంది. కంగనా తరచుగా సోషల్ మీడియాలో ఏవో ఒక పోస్టులు పెడుతుంటుంది. దేశంలోని సమస్యలపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది. నటిగాను, వివాదాల పరంగానూ కంగనా ఎంతో ఫేమస్‌. ఆమెను అభిమానించే వాళ్లు ఉన్నట్టే వ్యతిరేకించేవారూ ఉంటారు. అయితే నటిగా మాత్రం ఆమెను విమర్శించరు. ఎందుకంటే నటనలో ఆమె క్వీనే. ఇక కంగనాకు సంబంధించిన లవ్‌ మేటర్స్‌ ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. ఇటీవల కంగనా రనౌత్‌కు సంబంధించిన ఓ న్యూస్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైలోని ఓ సెలూన్ నుంచి కంగనా బయటకు వస్తూ కనిపించింది. ఈ సమయంలో కంగనాతో ఒక విదేశీ మిస్టరీ మ్యాన్‌తో చేతులు పట్టుకుని నడుస్తూ కనిపించాడు. వెంటనే ఈ ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.

ఎవరు అతను?
మిస్టరీ మ్యాన్‌తో కంగనా చిత్రాలు బయటకు వచ్చిన తర్వాత, ఆమె డేటింగ్ జీవితం గురించి గాసిప్‌లు మొదలయ్యాయి. ఈ సమయంలో కంగనా రనౌత్ చాలా అందమైన స్కై బ్లూ కలర్ స్కర్ట్‌తో పాటు గ్లాసెస్‌ కూడా పెట్టుకోని ఉంది. ఆమెతో పాటు కనిపించిన మిస్టరీ మ్యాన్ విదేశీయుడిలా ఉన్నాడు. ఒకరి చేతులు మరొకరు గట్టిగా పట్టుకుని ఇద్దరూ కలిసి సెలూన్ నుంచి బయటకు వచ్చారు. కంగనా ముఖంలో ఆనందం చూసి అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కంగనా (Kangana Ranaut) తన నిజమైన ప్రేమను కనుగొన్నట్లు అనిపిస్తోందని అనుకుంటున్నారు.

బాలీవుడ్‌లోని బోల్డ్, బాహాటంగా మాట్లాడే నటీమణులలో కంగనా రనౌత్ ఒకరు. ఆమె తన సినిమాలతో పాటు తన ప్రకటనలతో వార్తల్లో నిలుస్తుంటారు. కంగనా వర్క్ ఫ్రంట్ గురించి చెప్పాలంటే, అది ఆమె రాబోయే చిత్రం 'ఎమర్జెన్సీ' (Emergency). ఈ చిత్రంలో ఆమె ఇందిరా గాంధీ (Indira Gandhi) పాత్రలో కనిపించనుంది.

Also Read: దేశంలోనే తొలిసారి.. AI తో 62 ఏళ్ల రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స!

WATCH:

Advertisment
తాజా కథనాలు