Mumbai : పారిశుద్ధ్య కార్మికులు బానిసలు కాదు.. ఆ కేసులో హైకోర్టు కీలక తీర్పు!

మున్సిపల్ కార్మికులకు సంబంధించిన ఓ కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పారిశ్యుద్ధ కార్మికుల ఉద్యోగాలను పర్మినెంట్ చేసి, వారికి అన్ని ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వారిని బానిసలుగా చూడకూడదని సూచించింది.

New Update
Mumbai : పారిశుద్ధ్య కార్మికులు బానిసలు కాదు.. ఆ కేసులో హైకోర్టు కీలక తీర్పు!

Municipality : మున్సిపల్(Municipal) కార్మికులకు సంబంధించిన ఓ కేసులో ముంబై హైకోర్టు(Mumbai High Court) సంచలన తీర్పు వెల్లడించింది. సంక్షేమ ప్రభుత్వంలో ఒక వర్గానికి చెందిన పౌరుల పరిశుభ్రత కోసం పనిచేసే మరో వర్గాన్ని బానిసలుగా చూస్తే పురోగతి సాధించలేమని చెప్పింది. ముంబైలో 580 మంది పారిశ్యుద్ధ కార్మికుల ఉద్యోగాలను పర్మినెంట్ చేసి, వారికి అన్ని ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

పర్మినెంట్ గా పరిగణించాలి..
ఈ మేరకు ముంబై మున్సిపల్‌ విభాగంలో కొంతకాలంగా పనిచేస్తోన్న 580 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు(Contract Employees) తమను పర్మినెంట్ గా పరిగణించాలని కోరుతూ వర్కర్స్‌ యూనియన్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో రోడ్లు ఊడవటం, చెత్త సేకరించడం వంటి పనులు నిర్వర్తించే కార్మికులకు శాశ్వత పోస్టులు సృష్టించాలంటూ ఇండస్ట్రియల్‌ ట్రైబ్యునల్‌ గతంలో తీర్పు వెల్లడించింది.

ఇది కూడా చదవండి: M Kharge: ప్రజలు విరాళంగా ఇచ్చిన డబ్బును ఫ్రీజ్‌ చేశారు.. ఏన్డీఏపై ఖర్గే విమర్శలు!

బానిసగా చూడటం నేరం..
అయితే ఈ తీర్పును మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ ముంబై(MCGM) హైకోర్టులో సవాలు చేయగా గురువారం దీనిపై తుది విచారణ జరిగింది. ఈ మేరకు విచారణ జరిపిన జస్టిస్‌ మిలింద్‌ జాధవ్‌ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం.. 'స్వచ్ఛమైన వాతావరణం పౌరుల ప్రాథమిక హక్కు. కార్మికుల గౌరవాన్ని కాలరాయడం ద్వారా పురోగతి సాధించలేం. సంక్షేమ ప్రభుత్వంలో ఒక తరగతి పరిశుభ్రత కోసం మరో వర్గాన్ని బానిసగా చూడటం నేరం' అని పేర్కొంటూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వెంటనే అమల్లోకి రావాలని సూచించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు