IPL : ఇండియన్ క్రికెటర్(Indian Cricketer) హార్దిక్ పాండ్యా(Hardik Pandya) మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్ మెగా టోర్నీలో భాగంగా 17వ సీజన్ కు ముంబై సారథిగా బాధ్యతలు చేపట్టిన పాండ్యా.. శనివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఓటమికీ కారణంపై స్పందిస్తూ తెలుగు యంగ్ ప్లేయర్ తిలక్ వర్మను టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది.
అలా చేయడం వల్లే ఓడిపోయింది..
ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) నిర్ధేశించిన 258 పరుగుల భారీ లక్ష్య చేధనలో ముంబై ఇండియన్స్(Mumbai Indians) పది పరుగుల తేడాతో ఓడింది. తిలక్ వర్మ 32 బంతుల్లో 63 పరుగులు చేసి చివరి ఓవర్ వరకూ క్రీజ్‌లో ఉండి పోరాడినప్పటికీ ముంబైని విజయతీరాలకు చేర్చలేకపోయాడు. దీంతో లెఫ్ట్ హ్యాండర్ స్పిన్ వేస్తున్నప్పుడు తిలక్ షార్ట్స్ ఆడకుండా సింగిల్స్ తీయడంతోనే ముంబై ఓడిపోయిందనన్నాడు పాండ్యా. అంతేకాదు తిలక్‌కు ఆట పట్ల అవగాహన లేకపోవడంతోనే ఇలా జరిగిందన్నాడు. దీంతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ హార్ధిక్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'నువ్వు ఏం పొడిచావ్.. బ్యాటింగ్ చేసినపుడు ఏం **కావ్' అంటూ తిట్టిపోస్తున్నారు.
ఇది కూడా చదవండి: BSNL: ఓటీటీ వినియోగదారులకు బంపర్ ఆఫర్.. భారీగా తగ్గిన ప్లాన్ ధరలు!
ఇదిలావుంటే.. ఇటీవలే మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్ మాట్లాడులూ.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా గత కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తోందని చెప్పారు. 'ఒక వైపు కెప్టెన్సీ కష్టాలు.. మరోవైపు వరుస ఓటములు. ఇక ఇవన్నీ చాలవన్నట్లుగా ప్రేక్షకుల విమర్శలు. ఇవన్నీ కలిసి పాండ్యాను మానసికంగా కుంగదీస్తున్నాయి. దీంతో అతడు కెప్టెన్ గా సఫలం కాలేకపోతున్న. అతడు ఈ ఐపీఎల్ సీజన్ లో అనుసరించే వ్యూహాలు సరిగిలేవు. పాండ్యాకు బుర్ర పనిచేయడం లేదు' అంటూ చురకలంటించాడు.