Mulugu: మంగపేటలో మ‌హిళా ఆరోగ్య క్లీనిక్‌కు ప్రారంభోత్సవం

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మ‌హిళా ఆరోగ్య క్లీనిక్‌కు ప్రారంభోత్సవం చేశారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. మహిళలు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకుండా వైద్య సేవలు పూర్తిస్థాయిలో వినియోగించు కోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం మంగపేట పీహెచ్‌సీలో మ‌హిళా ఆరోగ్య క్లీనిక్‌ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు.

New Update

ఈ సందర్భంగా కలెక్టర్ పీహెచ్‌సీలో నాణ్యత ప్రమాణాలతో వైద్య పరీక్షలు, సేవలు అందించాలని, రోగుల పట్ల మర్యాదగా ఉండాలని కలెక్టర్ అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు. వ్యాధులు ఆర్థికంగా మానసికంగా నష్టపరుస్తాయని, సమస్యలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, తక్షణమే మందులు అందజేయుటకు క్యాన్సర్, బీపీ, షుగర్, సెక్సువల్ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్, పీసీవోడీ, వెయిట్ మేనేజ్‌మెంట్, రుతుస్రావ, మూత్రనాల ఇన్ఫెక్షన్, మధుమేహం, రక్తపోటు, రక్త హీనత, ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్, సూక్ష్మ పోషకాల లోపాలు, నెలసరి, సంతాన పరీక్షలతో పాటు పలు రకాల టెస్టులు చేస్తారని కలెక్టర్ తెలిపారు.

అన్ని వయస్సుల మహిళలకు ప్రత్యేక క్లినిక్‌లో వైద్య సేవలు అందిస్తామన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబానికి పెద్ద ఆసరాగా ఉంటారని అన్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, వైద్యాధికారులు పరీక్షించి టెస్టులు రాసిన యెడల తప్పనిసరిగా చేయించుకోవాలని, క్రమం తప్పకుండా మందులు వాడాలని కలెక్టర్ సూచించారు. మహిళల యొక్క శరీర బరువును ఎత్తుకు తగ్గట్టు బరువు ఆరోగ్యం ఎప్పుడు ఒకే విధంగా ఉంచుకోవడం వల్ల ఎన్నో రకాల వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. ఆరోగ్య మహిళ క్లినిక్‌లకు వచ్చే మహిళలు పరీక్షల అనంతరం డాక్టర్ ఇచ్చే సూచనలు, సలహాలు పాటించాలని తిరిగి ఫాల్ అప్‌కి రమ్మనప్పుడు రావాలని జిల్లా కలెక్టర్ కోరారు.

ఈ కార్యక్రమంలో డీఎం అండ్ హెచ్ ఓ అప్పయ్య, మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడి తుల రవి, పీహెచ్‌ఎస్‌సీ డాక్టర్ నరేష్, Dr వైశాలి, ఎంపీడీవో సుదర్శన్, ఎంపీవో మమత, స్టాఫ్ నర్సులు తదితరులు పాల్గొన్నారు.

Advertisment
తాజా కథనాలు