కస్తూర్బా హాస్టల్‌లో తప్పిన పెను ప్రమాదం... కాలి బూడిదైన విద్యార్థుల సామాగ్రి

కొద్దిరోజులుగా ఏదో ఒక చోట అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. వరస అగ్ని ప్రమాదాలు అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. నిన్న ఢిల్లీలో అగ్ని ప్రమాదం మరవక ముందే.. తాజాగా మరో ఘటన అందరినీ కలవర పెడుతోంది. ఈ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో అర్థం కాక అందరు ఇబ్బంది పడుతున్నారు.

New Update
కస్తూర్బా హాస్టల్‌లో తప్పిన పెను ప్రమాదం... కాలి బూడిదైన విద్యార్థుల సామాగ్రి

Fire accident in Kasturba Hostel (Mulugu) :

హాస్టల్‌లో అగ్ని ప్రమాదం..

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం తెలంగాణ రాష్ట్రం SC, ST, OBC మరియు మైనారిటీ వర్గాలకు చెందిన బాలికల కోసం ప్రాథమిక స్థాయిలో రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూల్‌లో పిల్లలకు హాస్టల్‌ కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఓ కస్తూర్బా హాస్టల్‌ (Kasturba hostel) లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విద్యార్థు సమాన్ల దగ్ధమైయ్యాయి. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో జరిగింది. జవహర్‌నగర్‌లో ఉన్న ఓ కస్తూర్బా హాస్టల్‌లో అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విద్యార్థుల పెట్టెలు, దుస్తులు, బ్యాగులు కాలి బూడిదైనయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే ఆ గదిలో విద్యార్థులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

వరస ప్రమాదం

ఈనెల 7వ తేదీ దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్‌ (AIIMS Delhi) లో అగ్నిప్రమాదం జరిగింది. ఎండోస్కోపీ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే రోగులను అక్కడి నుంచి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆరు ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నించిన విషయం తెలిసిందే.

ఈనెల 2న హైదరాబాద్‌ హబ్సిగూడ లో మరో అగ్నిప్రమాదం జరిగింది. అన్‌లిమిటెడ్‌ షోరూం నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్‌లోని 2,3వ అంతస్తుల్లోని హబ్సిగూడ అన్ లిమిటెడ్ షోరూంలో అర్థరాత్రి దాటిన తరువాత మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అంచనా వేశారు అధికారులు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇలా వరస ఈ అగ్ని ప్రమాదాల కారణంగా నగర వాసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఎప్పుడు ఏదో ఒక ప్రమాదం జరిగి అందరిని టెన్షన్‌ పేడుతోంది.

Also Read: లోక్‌సభలో అవిశ్వాస యుద్ధం..

Advertisment
తాజా కథనాలు