/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-05T171452.846.jpg)
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేష్ అంబానీ తన కుమారుడి వివాహానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని స్వయంగా ఆహ్వానించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసానికి వెళ్లి ఆమెను కలిశారు ముఖేష్ అంబానీ. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను కూడా సోనియా గాంధీకి అందించారు.
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహం 13న జరగనుంది.మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు. పలువురు ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది.