ముఖేష్‌ అంబానీకి మూడోసారి బెదిరింపు ఈ-మెయిల్..400 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం!

రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ కి మూడోసారి గుర్తు తెలియన వ్యక్తి నుంచి బెదిరింపు ఈ మెయిల్‌ వచ్చింది. రూ. 400 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని దుండగుడు మెయిల్ పంపాడు. దీంతో పోలీసులు అంబానీకి భద్రతను కట్టుదిట్టం చేశారు.

ముఖేష్‌ అంబానీకి మూడోసారి బెదిరింపు ఈ-మెయిల్..400 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం!
New Update

Mukesh Ambani gets third death threat: భారత దిగ్గజ వ్యాపారవేత్త, ఆసియాలోనే కుబేరుల్లో ఒకరైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీకి గత కొంత కాలంగా బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయనకు సోమవారం కూడా మరోసారి బెదిరింపు వచ్చింది. ఆగంతకుడు ఆ బెదిరింపును మెయిల్ కి పంపాడు.

అక్టోబర్ 27, 28 తేదీల్లో బెదిరించిన వ్యక్తే ఈ సారి కూడా మెయిల్‌ పెట్టినట్లు సమాచారం. ఆ మెయిల్‌ లో '' మీ సెక్యూరిటీ ఎంత బలంగా ఉన్నా మాకు అవసరం లేదు. మా ఒక స్నిపర్‌ నిన్ను చంపేయడం ఖాయం. ఈసారి మాకు రూ. 400 కోట్లు (400 crores) కావాలి. పోలీసులు నన్ను అసలు ట్రాక్‌ చేయలేరు'' అంటూ మెయిల్‌ పంపించాడు దుండగుడు.

Also read: రాజకీయ నాయకుడి కొడుకుకే ఆసుపత్రిలో బెడ్‌ లేదు..ఇక సామాన్యుల సంగతేంటి?

ఇలా అంబానీకి వరుసగా మూడోసారి కూడా బెదిరింపు మెయిల్‌ రావడంతో అంబానీ (Mukesh Ambani) నివాసం ఎదుట పోలీసులు భద్రతను పెంచారు. మొదటిసారి అంబానీకి బెదిరింపు వచ్చినప్పుడు దుండగుడు రూ.20 కోట్లు డిమాండ్‌ చేశాడు. తన వద్ద ఇండియాలోనే బెస్ట్‌ షూటర్స్‌ ఉన్నట్లు చెప్పాడు. అప్పుడే అంబానీ సెక్యూరిటీ అధికారులు పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు.

మరుసటి రోజే మరోసారి బెదిరింపు మెయిల్ వచ్చింది. ముందు చేసిన మెయిల్‌ గురించి పట్టించుకోలేదని ఈసారి రూ.200 కోట్లు డిమాండ్‌ చేశాడు. తాజాగా మూడోసారి కూడా అంబానీకి బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అయితే అంబానీకి ఇలా బెదిరింపులు రావడం కొత్త కాదు.

గత సంవత్సరం కూడా అంబానీ సంస్థలను పేల్చేయడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా చంపేస్తామని బెదిరించాడు ఓ వ్యక్తి. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోనికి తీసుకుని అరెస్ట్‌ చేశారు. అంతకుముందు ఏడాది కూడా అంబానీ నివాసం ఎదుట పేలుడు పదార్థాలతో ఉన్న ఓ వాహనాన్ని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Also read: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌…3,220 పోస్టులకు నోటిఫికేషన్‌!

#death-threat #mukesh-ambani #e-mail #reliance
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి