Mudragada: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ తెరచాటు రాజకీయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులు ఒకపక్క రాజాధికారం కోసం పోరాడుతుంటే, వారిని పక్క పార్టీకి తాకట్టు పెట్టే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడని మండిపడ్డారు.
Also Read: నరసాపురం టీడీపీలో అసంతృప్తి సెగలు.. రెబల్‌గా మాధవ నాయుడు
కాపు రిజర్వేషన్ కోసం కిర్లంపూడిలో పోరాటం చేస్తే తనను పోలీసులతో కొట్టించి ఇబ్బందులు పెట్టినప్పుడు ఒక్కసారైనా పలకరించావా? చిన్న ఉత్తరం ముక్క అయినా రాశావా? అని ప్రశ్నించారు. తాను ఎందుకు సపోర్ట్ చేయాలి, జనసేన పార్టీని తాను ఎందుకు కాపాడాలో చెప్పాలని పవన్ ను ప్రశ్నించారు.
Also Read: అలా నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా.. కారుమూరి సునీల్ సవాల్..!
చంద్రబాబు నాయుడు తొత్తుగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ కి సిగ్గు లేదని దుయ్యబట్టారు. కాపుల రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తుంటే చంద్రబాబు నాయుడుకి మద్దతు పలకడం తగునా అంటూ పవన్ ను ప్రశ్నించారు. పవన్ కు రాజకీయాలకి పనికిరావని సినిమాలు చేసుకోవాలని సూచించారు.