Mudasarlova: ఆ పార్కును పరిరక్షించండి.. అధికారులకు పవన్ కీలక ఆదేశాలు!

విశాఖలోని ముడసర్లోవ పార్కు వద్ద పర్యావరణానికి హాని కలిగించే చర్యలు లేకుండా చూడాలని ఏపీ డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. వందలాది మంది సందర్శించే ఆ పార్కు 105 రకాల పక్షులకు ఆవాస ప్రాంతమని తెలిపారు. దీనిని జీవీఎంసీ పరిరక్షించాలని కోరారు.

Mudasarlova: ఆ పార్కును పరిరక్షించండి.. అధికారులకు పవన్ కీలక ఆదేశాలు!
New Update

Vishaka: విశాఖపట్నంలోని ముడసర్లోవ పార్క్ పరిసరాల్లో పర్యావరణానికి హాని కలిగించే ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జీవీఎంసీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముడసర్లోవ పార్కులో జీవీఎంసీ కట్టడాలు చేపడితే పర్యావరణ విధ్వంసానికి దారి తీస్తుందని విషయాన్ని విశ్రాంత ఐఏఎస్ అధికారి, పర్యావరణవేత్త ఈ.ఎ.ఎస్. శర్మ రాసిన రాసిన లేఖపై పవన్ స్పందించారు. నిత్యం వందలాది మంది ప్రజల సందర్శించే ముడసర్లోవ పార్కు 105 రకాల పక్షులకు ఆవాస ప్రాంతమని, జీవీఎంసీ ఆ పార్కులో భవనాల నిర్మాణానికి సిద్ధం అవుతోందని వచ్చిన వార్తలను ఉటంకిస్తూ.. ముడసర్లోవ పార్కును పరిరక్షించాలని కోరారు. ఈ విషయమై తక్షణం స్పందించిన పవన్ జీవీఎంసీ అధికారుల వివరణ కోరారు. జీవీఎంసీ అధికారులు అలాంటి ప్రతిపాదనలు ఏమీ లేవని పవన్ కు తెలియచేశారు.

#vishaka-patnam #mudasarlova #chief-pawankalyan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe