Budget 2024: దేశంలోని చిన్న వ్యాపారులు కేంద్ర బడ్జెట్ నుంచి కోరేదేమిటి? MSME రంగ డిమాండ్స్ ఇవే!

బడ్జెట్ తేదీ దగ్గర పడుతోంది. దీనికి ముందు, దేశంలోని చిన్న వ్యాపారులు తమ డిమాండ్లలో కొన్నింటిని అంగీకరించి బడ్జెట్‌లో తమకు ఉపశమనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దేశంలోని MSME రంగం యొక్క డిమాండ్లు ఏమిటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. 

New Update
Budget 2024: దేశంలోని చిన్న వ్యాపారులు కేంద్ర బడ్జెట్ నుంచి కోరేదేమిటి? MSME రంగ డిమాండ్స్ ఇవే!

Budget 2024: దేశంలోని చిన్న వ్యాపారవేత్తలు, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న- మధ్యతరహా పరిశ్రమలలో (MSME) వ్యాపారం చేస్తున్న వారు భారతదేశ GDPకి 30 శాతం వాటాను అందిస్తున్నారు. కొత్త విధానంలో అనేక స్టార్టప్‌లు కూడా ఈ రంగంలో భాగమయ్యాయి. అటువంటి పరిస్థితిలో, 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను సమర్పించడానికి ముందు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ డిమాండ్లలో కొన్నింటిని ఆమోదించాలని ఈ రంగానికి చెందిన వ్యాపారులు కోరుతున్నారు.

Budget 2024: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కాబట్టి, ఇప్పుడు జూలై 22వ తేదీన  ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను సమర్పించవచ్చని వార్తలు వస్తున్నాయి. ఆర్థిక మంత్రి నుండి భారతీయ రిజర్వ్ బ్యాంక్ వరకు, ప్రతి ఒక్కరూ MSME రంగ ఇబ్బందుల గురించి వింటున్నారు. ఎందుకంటే నిరుద్యోగ సవాలును ఎదుర్కోవడంలో ఈ రంగం చాలా సహాయపడుతుంది.

ఉపాధి కోసం రూ.5,000 కోట్లు కోరిన మంత్రిత్వ శాఖ..
Budget 2024: సూక్ష్మ, చిన్న- మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా MSME రంగానికి మొదటి డిమాండ్ వచ్చింది. కొద్ది రోజుల క్రితం, MSME మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి అదనంగా రూ. 5,000 కోట్లు డిమాండ్ చేసింది. ఈ నిధిని ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) కింద దరఖాస్తుల పరిష్కారానికి మంత్రిత్వ శాఖ ఉపయోగిస్తుంది.

Also Read: గత మూడేళ్లలో 1.25 లక్షల కోట్ల సైబర్ మోసాలు! వీటి నుంచి ఎలా తప్పించుకోవాలి?

PMEGP కింద, ప్రభుత్వం ఖాదీ - విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) ద్వారా స్వయం ఉపాధి కోసం రాయితీపై బ్యాంకు రుణాలను అందిస్తుంది. 2021-2026 కోసం ప్రభుత్వం PMEGP కింద రూ.13,500 కోట్లు కేటాయించింది. ఇప్పుడు మంత్రివర్గం అదనంగా రూ.5,000 కోట్లు డిమాండ్ చేసింది.

నగదు ప్రవాహం.. సులభంగా వ్యాపారం చేయడంపై కృషి చేయాలి
Budget 2024: కోవిడ్ అనంతర ప్రభావాలతో ఇప్పటికీ పోరాడుతున్న MSME రంగం మరొక పెద్ద డిమాండ్ ఏమిటంటే, నగదు ప్రవాహాన్ని మెరుగుపరచడానికి బడ్జెట్‌లో కొన్ని పథకాలుఅలాగే, మంచి  విధానాన్ని తీసుకురావడం. ఇందులో స్టార్టప్‌ల నిధుల అంశం కూడా చాలా ముఖ్యమైనది. అదే సమయంలో, ఈ విభాగంలో కూడా సులభతరంగా వ్యాపారం చేయడంపై ప్రభుత్వం మరింత కృషి చేయాలని MSME రంగం కోరుతోంది.

ఇండస్ట్రీ నిపుణులు ఏమంటున్నారు?
Budget 2024: పరిశ్రమ నిపుణులు రాబోయే బడ్జెట్‌లో ఈజ్ ఆఫ్ డూయింగ్ కోసం, MSME రంగానికి IT మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం కొన్ని కేటాయింపులు చేయవచ్చని భావిస్తున్నారు.  ఐటి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లో పెట్టుబడి పెట్టడానికి అయ్యే ఖర్చులపై ప్రభుత్వం వారికి పన్ను మినహాయింపు ఇవ్వవచ్చని అంచనా వేస్తున్నారు. AI, సప్లయ్ చైన్ సిస్టమ్- CRM మొదలైన భవిష్యత్ సాంకేతికతలను అవలంబించడంలో ఇది వారికి సహాయపడుతుంది.

మరోవైపు MSME రంగ సంస్థలతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా సమావేశం అవుతోంది. తద్వారా వారి అవసరాలను అర్థం చేసుకోవచ్చని భావిస్తున్నారు. అలాగే, MSMEల కోసం నగదు ప్రవాహాన్ని పెంచడానికి RBI ఏదైనా ఏర్పాటు చేస్తే, దాని ఆచరణాత్మకత ఎలా ఉంటుందో తెలుసుకోవడం కూడా ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశ్యంగా చెబుతున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు