Mrunal Thakur : ఫస్ట్ టైమ్ అలాంటి సినిమాలో నటించనున్న మృణాల్ ఠాకూర్..సెట్ అవుతుందా?

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో 'కాంచన 4' తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో మృణాల్‌ ఠాకూర్ కి హీరోయిన్‌గా ఆఫర్ వచ్చిందట. ఇప్పటికే నెరేషన్ అయిపోయిందని, ఈమె రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి మృణాల్ ఓకే చెప్తే ఆమె నటించే ఫస్ట్ హారర్ మూవీ ఇదే అవుతుంది.

Mrunal Thakur : ఫస్ట్ టైమ్ అలాంటి సినిమాలో నటించనున్న మృణాల్ ఠాకూర్..సెట్ అవుతుందా?
New Update

Mrunal Thakur Talks For Kanchana 4 : 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలతో అలరించింది. ఈ సినిమాలన్నింటిలో చాలా క్లాస్ గా హోమ్లీ లుక్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు దెయ్యంగా భయపెట్టేందుకు రెడీ అవుతోందట. సౌత్ బ్లాక్ బస్టర్ హారర్ ఫ్రాంచైజీలో మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్ లో నటిస్తున్నట్లు తాజా సమాచారం బయటికొచ్చింది.

'కాంచన 4' లో హీరోయిన్ గా...

డ్యాన్స్ మాస్టర్, డైరెక్టర్ కం హీరో రాఘవ లారెన్స్ (Lawrence) నటిస్తూ దర్శకత్వం వహించిన కాంచన సిరీస్ కి సౌత్ లో ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సిరీస్ నుంచి ముని, కాంచ‌న, గంగ(కాంచన 2), కాంచ‌న 3 వంటి సినిమాలు ఆడియన్స్ ని బాగా భయపెట్టాయి. ఇక ఇప్పుడు కాంచన 4 కూడా రాబోతుంది. ఈ సిరీస్‌లో మృణాల్‌ ఠాకూర్ కి హీరోయిన్‌గా ఆఫర్ వచ్చిందట. ఇప్పటికే నెరేషన్ అయిపోయిందని, ఈమె రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుస్తోంది.

Also Read : రణ్ బీర్ ఇంటి పక్కనే ఇల్లు కొన్న’యానిమల్’ బ్యూటీ.. ఎన్ని కోట్లో తెలుసా?

ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కి మృణాల్ కనుక ఓకే చెప్తే.. ఆమె నటించే ఫస్ట్ హారర్ మూవీ ఇదే అవుతుంది. మరి 'కాంచన 4' లో మృణాల్ ఠాకూర్ దెయ్యంగా భయపెడుతుందేమో చూడాలి. ఇక ఇటీవలే కాంచన 4 మూవీని అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ లో షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమా 2025 సమ్మర్ లో రిలీజ్ కానుంది.

#kanchana-4 #mrunal-thakur
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి