నానితో రొమాన్స్.. అనుకున్నదానికంటే ఎక్కువే అయినా బాగుంది: మృణాల్

యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తను నటించిన 'హాయ్ నాన్న' సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. డిసెంబర్ 7న రాబోతున్న సినిమాలో నాని తనను హత్తుకునే ఓ సన్నివేశం చాలా కీలకమైనదిగా పేర్కొంది. ఆ క్షణం భావోద్వేగాల ప్రవాహంలా అనిపించిందని, తనకు ఎప్పుడూ ఎదురుకాని అనుభవమన్నారు.

నానితో రొమాన్స్.. అనుకున్నదానికంటే ఎక్కువే అయినా బాగుంది: మృణాల్
New Update

తెలుగులో చేసిన తొలి సినిమా ‘సీతారామం’తోనే ప్రేక్షకులకు కట్టిపడేసిన మృణాల్ ఠాకూర్.. మరోసారి 'హాయ్ నాన్నతో' అలరించబోతుంది. నాని హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 7న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ తన కెరీర్ అండ్ పర్సనల్ విషయాలపై ఓపెన్ అయింది. అంతేకాదు తన ఇష్టాలు, అయిష్టాల గురించి కూడా చెప్పుకొచ్చింది. ఈ మేరకు మంచి కథ ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా రావొచ్చు. వచ్చినప్పుడు మాత్రం వాటిని నిజాయతీగా చేయాలనేదే తన అభిమతం అని చెప్పింది.

publive-image

తెలుగు ప్రేక్షకులు నన్ను సీతగా గుర్తు పెట్టుకున్నారు. అలాంటి ఓ బలమైన పాత్ర తర్వాత, మరో సినిమా చేస్తున్నానంటే ఎన్నో అంచనాలు ఉంటాయి. మరో విభిన్నమైన పాత్రలో చూడాలనుకుంటారు. అందుకు తగిన కథ, పాత్రలు ‘హాయ్‌ నాన్న’లో ఉన్నాయని బలంగా నమ్మా. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే ఇందులో నాని, నేను పోషించిన విరాజ్‌, యష్ణ పాత్రలు ప్రేక్షకుల్ని ప్రేమలో పడేస్తాయి. తెలుగు సినిమా అయినా, హిందీలో అయినా నా మనసుకు దగ్గరైన పాత్రల్నే ఎంచుకుంటుంటా. ఇందులో నేను పోషించిన యష్ణ పాత్ర నా హృదయానికి బాగా దగ్గరైంది. అలాగే హిందీలో చేసిన ‘జెర్సీ’ కానీ, ఇక్కడ చేసిన ‘సీతారామం’ కానీ ఒకొక్కటి ఒక్కో కాలంలో సాగే కథ. ‘హాయ్‌ నాన్న’ నేటి కథ. వాటిలాగే బలమైన భావోద్వేగాలు ఉంటాయి కానీ, పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ కథలో పలు పార్శ్వాలున్నాయి. హాస్యం, ప్రేమ, భావోద్వేగాలు ఇలా అన్ని రకాల అంశాలకి ప్రాధాన్యం ఉన్న కథ ఇది. పేరుని చూసి ఇది తండ్రీ కూతుళ్ల కథ అనుకుంటే పొరపాటే. మానవీయ బంధాలన్నింటినీ ప్రతిబింబించేలా ఉంటుందని చెప్పారు.

Also read :‘యానిమల్’ మత్తు దిగకముందే.. మరో షూటింగ్ లో జాయిన్ అయిన రష్మిక!

ఇక ఈ మూవీలో ట్రైలర్‌లో నాని తనను హత్తుకునే ఓ సన్నివేశ చాలా కీలకమైనదిగా పేర్కొంది. దానికోసం షెడ్యూల్‌లో అదనంగా గంటన్నర సమయాన్ని కేటాయించి చిత్రీకరణకి సిద్ధమయ్యాం. భావోద్వేగ ప్రధానమైన సన్నివేశం చేస్తున్నప్పుడు నటులు పాత్రని అనుభూతి చెందుతూ, తమని తాము ప్రేరేపించుకుంటూ నటించాలి. అప్పుడు కానీ భావోద్వేగాలు పండవు. కానీ ఆ సన్నివేశం కోసం కెమెరా ముందుకు వెళ్లగానే అప్రయత్నంగానే ఆ పాత్రల్లో ఒదిగిపోయాం. భావోద్వేగాల ప్రవాహంలా అనిపించాయి ఆ క్షణాలు. ఇదివరకెప్పుడూ నాకు ఎదురుకాని అనుభవం అది. ఇలాంటి సందర్భాలు ఇంకా చాలానే ఉన్నాయి. వాటి గురించి చెబితే కథ బయటకొస్తుందని నా భయం. ఇంకా మంచి చిత్రాలు చేయాలి. మృణాల్‌ ఠాకూర్‌ అంటే ఎవరో ప్రేక్షకులు గుర్తు పట్టకపోయినా ఫర్వాలేదు కానీ, నేను చేసిన పాత్రలు మాత్రం వాళ్ల మనసుల్లో అలా చిరస్థాయిగా ఉండిపోవాలి. సీతగా నన్నెంతగా గుర్తు పెట్టుకున్నారో, యష్ణగా కూడా అంతే ప్రభావం చూపిస్తాననే నమ్మకం ఉంది.

Mrunal Thakur

‘హాయ్‌ నాన్న’ ప్రయాణంలో నాని చాలా సహకారం అందించారు. విలువైన సూచనలు ఇచ్చారు. మరోసారి ఆయన్నుంచి గొప్ప నటనని ఇందులో చూస్తారు. కియారా అనే చిన్నారి కూడా ఇందులో నటించింది. అంత చిన్న వయసులోనే భావోద్వేగాల్ని చాలా బాగా అర్థం చేసుకుంటూ నటించింది. తన పాత్ర చాలా కీలకం. దర్శకుడు శౌర్యువ్‌ విజన్‌, తనలోని స్పష్టత గొప్పగా ఉంటాయి. ఓ కొత్త దర్శకుడితో పని చేస్తున్నట్టు ఎప్పుడూ అనిపించలేదు. తన దర్శకత్వంలో మళ్లీ నటించాలని ఉంది. మోహన్‌, విజేందర్‌రెడ్డి ఎంతో తపన ఉన్న నిర్మాతలు. సినిమా కోసం ఎక్కడా రాజీపడలేదు. తెలుగు కథలు అద్భుతంగా ఉంటున్నాయి. నమ్మకంతోపాటు, నిజాయతీతో పనిచేయడం నాకు ఇష్టం. ‘సీతారామం’ విడుదలైనప్పటి నుంచీ తెలుగు కథలు వింటూనే ఉన్నా అంటూ చెప్పుకొచ్చింది.

#hi-nanna #nani #mrinal-thakur
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe