/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-9-8.jpg)
Mr.Bachchan Movie Team : ప్రభాస్ ఫ్యాన్స్ కు 'మిస్టర్ బచ్చన్' టీమ్ స్పెషల్ సర్పైజ్ ప్లాన్ చేసింది. రవితేజ - హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా నిర్మాతలు రవితేజ, ప్రభాస్ ఇద్దరినీ ఒకే స్క్రీన్ పై చూపించడానికి ప్లాన్ చేసినట్లు తాజా సమాచారం బయటికొచ్చింది. అదెలా అని అనుకుంటున్నారా?
మ్యాటర్ ఏంటంటే.. ప్రభాస్ 'రాజాసాబ్' గ్లింప్స్‌ను 'మిస్టర్ బచ్చన్' స్క్రీనింగ్ టైంలో ప్లే చేయబోతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ ఎక్స్ వేదికగా తెలిపారు. మిస్టర్ బచ్చన్, రాజాసాబ్ సినిమాలను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ స్పెషల్ ట్రీట్ ను ప్లాన్ చేసినట్లు తెలిసింది. విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ 'రాజాసాబ్‌ను' ట్రెండింగ్ టాపిక్‌గా మార్చడంలో భాగంగా మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రభాస్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ అవుతున్నారు.
#RajaSaab 🤝 #BachchanSaab on the big screen🤩
Get ready to experience the FAN INDIA GLIMPSE of #TheRajaSaab added to #MrBachchan theatres.❤️🔥#MrBachchan Grand Premiers Today
In Cinemas From Tomorrow 💥Book your tickets now!
🎟️ https://t.co/fBC3B1CVsu#MassReunion
Mass… pic.twitter.com/HF2j8q1CXb— People Media Factory (@peoplemediafcy) August 14, 2024
Also Read : ‘తంగలాన్’ భారీ విజయం సాధిస్తుంది.. విక్రమ్ సినిమాపై సూర్య ఇంట్రెస్టింగ్ పోస్ట్!
ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతున్న 'రాజాసాబ్ గ్లింప్స్ వీడియోలో ఇప్పటికే యూట్యూబ్ లో దుమ్ములేపింది. ఇక ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై ఈ గ్లింప్స్ ను చూసేందుకు డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.