AP: జగన్ కు బిగ్ షాక్.. వైసీపీకి నెల్లూరు పెద్దారెడ్లు బై బై..! ఏపీలో వైసీపీకి కీలక నేతలు గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన పెద్దారెడ్లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. వేమిరెడ్డి, మాగుంట, శ్రీకృష్ణదేవరాయలు తన అనుచరులతో సహా టీడీపీలోకి వెళ్లనున్నట్లు సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. By srinivas 13 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Nellore Pedda Reddy's May Join TDP: నెల్లూరు జిల్లాకు చెందిన పెద్దారెడ్లు సీఎం జగన్‌కు (CM Jagan) షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వైసీపీకి (YCP) బై బై చెప్పనున్నట్లు సమాచారం. నెల్లూరు నగరంలోని వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) నివాసంలో మంగళవారం నాడు జిల్లాకు చెందిన పెద్దారెడ్లు భేటీ అయ్యారు. ఎంపీ వేమిరెడ్డిని ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కలిశారు. వీరి మాట్లాడుకుంటున్న సమయంలోనే అక్కడకు వచ్చారు గుంటూరు, నెల్లూరు వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పార్టీలో కొనసాగడానికి ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ససేమిరా అంటున్నారు. ఇన్‌చార్జ్‌ల మార్పులతో అలక.. ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న ఇన్‌చార్జ్‌ల (AP Incharges) మార్పుల నేపథ్యంలో చాలా మంది వైసీపీ నేతలు అలక బూనుతున్నట్లు తెలుస్తోంది. పార్టీని వదిలి వెళుతున్న సందర్భాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అలకబూనారు. వైసీపీకి గుడ్‌బై చెప్పబోతున్నారు. టీడీపీ తరపున నెల్లూరు ఎంపీగా (Nellore MP) బరిలోకి దిగే అవకాశాలున్నట్లు తెలిసింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డికి కోవూరు లేదా సర్వేపల్లి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. సోమవారం నాడు వేమిరెడ్డి హైదరాబాద్‌లో చంద్రబాబుతో (Chandrababu) వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమావేశమైనట్లు సమాచారం. మొత్తంగా నెల్లూరు జిల్లా వైసీపీలో రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్నాయి. వైసీపీలో తారుమారైన పరిస్థితులు.. మొన్నటివరకు వైసీపీలో అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారన్న పరిస్థతి కాస్త నేడు అసలు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సంబంధం లేదు అన్న విధంగా తయారైంది. ఏ స్థానం నుంచి ఎవరు పోటీలోకొస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ నుంచి పూర్తిగా దూరమయ్యారు. వరుసగా రెండు రోజుల నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కొంత శాంతింప జేసేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ అధిష్టానం. అయినప్పటికీ అది వర్కవుట్ కావడం లేదు. సోమవారం నాడు ఐప్యాక్‌కు చెందిన రుషి వచ్చి వేమిరెడ్డిని కలిసి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అలాగే మంగళవారం నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న వచ్చారు.. అయినా కూడా ఆయన మాట వినలేదు వేమిరెడ్డి. మంగళవారం నాడు ఆదాల, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వేమిరెడ్డిని కలిశారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డికి కొంత నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వేమిరెడ్డి నో చెప్పినట్లుగానే తెలుస్తోంది. మరోవైపు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా ఒంగోలు ఎంపీగా టీడీపీ నుంచి బరిలోకి దిగే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. నెల్లూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి రంగంలోకి దిగబోతున్నారు. మాగుంట, వేమిరెడ్డి ఇద్దరూ కలిసి ఒకేసారి పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లోనే నిర్ణయం రాబోతుందని తెలుస్తోంది. ఇది కూడా చదవండి : Abu Dhabi: దుబాయిలో కుంభ వృష్టి.. బుర్జ్ ఖలీఫాపై పిడుగు! నెల్లూరు అభ్యర్థిపై మొదలైన రగడ.. ఈ మీటింగ్ సమయంలోనే ఎటువంటి పరిస్థితుల్లోనూ తాము పార్టీలో కొనసాగే పరిస్థితి లేదని చెవిరెడ్డికి వేమిరెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తనకు తెలియకుండా నెల్లూరు అభ్యర్థిగా ఖలీల్‌ను ప్రకటించడం తనను పూర్తిగా బాధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి తాను ఎంతోకాలంగా ఆర్థికంగా, ఇతరత్రా అండగా ఉన్నప్పటికీ తనను అవమానించారని తెలియజేసినట్లు సమాచారం. ఇప్పటివరకు తాను రాజకీయాల్లో ఎలాంటి వివాదాలు లేకుండా కొనసాగానని, కానీ బయటి వ్యక్తులతో తనను విమర్శించే స్థాయికి చేర్చారని.. ఉద్దేశపూర్వకంగానే తనపై ఇలా చేస్తున్నారని చెవిరెడ్డికి స్పష్టంగా తెలియజేశారు వేమిరెడ్డి. నెల్లూరు సీటు విషయంలో అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే పట్టుబట్టారో.. దాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యతిరేకించడం మధ్య వచ్చిన వాన తుఫానుగా మారింది. ఇది పార్టీకి గుడ్‌బై చెప్పే స్థాయికి వెళ్లిపోయినట్లు తెలిసింది. మరోపక్క వేమిరెడ్డికి టీడీపీ ఆఫర్‌ను ప్రకటించింది. సోమవారం నాడు హైదరాబాద్‌లో మాజీ మంత్రి నారాయణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిసినట్లు సమాచారం. అలాగే చంద్రబాబు వద్దకు కూడా వేమిరెడ్డిని తీసుకెళ్లి మాట్లాడించారని తెలుస్తోంది. వేమిరెడ్డికి నెల్లూరు ఎంపీ, ఆయన భార్యకు సర్వేపల్లి లేదా కోవూరు లేదా కావలిలో ఏదో ఒక సీటు ఇచ్చే అవకాశమున్నట్లు తెలిసింది. ఏదో ఒక స్థానాన్ని నిర్ణయించుకుని తన వద్దకు రావాలని చంద్రబాబు తెలియజేసినట్లు సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో వేమిరెడ్డి వైసీపీకి గుడ్‌బై చెప్పనున్నారు. ఆయనతో పాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా గుడ్‌బై చెప్పనున్నారు. ఊగిసలాటలో ఆదాల..? ఇప్పటివరకు తాను వైసీపీలో కొనసాగుతానంటున్న ఎంపీ ఆదాల కూడా పార్టీపై కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. తనకు రావాల్సిన కాంట్రాక్టు బిల్లులను ప్రభుత్వం ఇంకా విడుదల చేయడం లేదని అసహనంతో ఉన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో నిలబడేందుకు సిద్ధమవుతున్నా.. ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని.. చెప్పినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. వాళ్లకి అవసరమైనప్పుడు మాత్రమే తమను గుర్తిస్తున్నారని.. నెల్లూరు ఎంపీగా ఉన్నప్పుడు కూడా తనను ఎవరూ పట్టించుకోవడం లేదని, ఏ నియోజకవర్గంలోనికి అడుగుపెట్టనివ్వడం లేదని.. జగన్‌కు చెప్పినప్పటికీ పెద్దగా రెస్పాన్స్ ఇవ్వలేదని గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో నెల్లూరు పెద్దారెడ్లు అందరూ వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. నెల్లూరు రాజకీయం ఏ క్షణంలో ఏం జరగబోతోందో తెలియని పరిస్థితులు చాలా స్పష్టంగా కనపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తనను కావాలనే రెచ్చగొడుతున్నారని.. ఎంపీగా పోటీచేసి వేమిరెడ్డి ఎలా గెలుస్తాడో తాము చూస్తామంటూ కొందరు సవాళ్లు విసురుతున్నారని వేమిరెడ్డి వైసీపీపై ఆగ్రహంగా ఉన్నారు. అలాగే ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే తనపై కొందరు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని.. కావాలనే తన ఫ్యామిలీని కూడా తిడుతున్నారని.. ఈ విషయాలు తనను తీవ్రంగా బాధించాయని.. తానేంటో వారికి చూపిస్తానన్న కసిలో వేమిరెడ్డి ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి తన అనుచరులతో సహా టీడీపీలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే నెల్లూరులో వైసీపీకి తీవ్ర నష్టం జరగనుంది. #nellore #tdp #prabhakar-reddy #ycp-cm-jagan #magunta-srinivas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి