Minister Advice : భర్తల మద్యం అలవాటు (Drinking Habit) మాన్పించాలనుకున్న మహిళలకు (Women's) మధ్య ప్రదేశ్ (Madhya Pradesh) మంత్రి నారాయణ్ సింగ్ కుష్వాహా చేసిన ఓ వింత ఘటన హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ ఘటన గురించి స్పందించిన కాంగ్రెస్ (Congress) మంత్రిది మంచి ఉద్దేశమే అయినా ఆయన విధానం బాగోలేదని పేర్కొంది. సామాజిక న్యాయ శాఖ మంత్రి నారాయణ్ సింగ్ కుష్వాహా భోపాల్ లో మాదక ద్రవ్యాలు, మద్యం ఇతర దురాలవాట్ల పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ్ సింగ్ (Narayan Singh Kushwah) ప్రసంగిస్తూ భర్తల మద్యం అలవాటు మాన్పించాలంటే వారిని ఇళ్లలోనే మద్యం సేవించమని చెప్పాలని మహిళలకు తెలిపారు. కుటుంబ సభ్యుల ముందు తాగడం నామోషీగా భావించిన పురుషులు క్రమంగా ఈ అలవాటు నుంచి బయటపడతారని ఆయన అన్నారు. పిల్లలు కూడా తండ్రినే అనుసరిస్తూ మద్యానికి బానిసలయ్యే ప్రమాదం ఉందని ఆయన మహిళలకు సూచించారు.
ఈ పద్ధతి చాలా మంచి పద్దతని, దీంతో పురుషులు మద్యం అలవాటు నుంచి బయటపడతారని మంత్రి అన్నారు. మంత్రి వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో కాంగ్రెస్ రంగంలోకి దిగింది. నారాయణ్ సింగ్ ఉద్దేశం మంచిదే అయినా ఆయన సలహా మాత్రం సరిగా లేదని అంటున్నారు.
Also read: మహిళలకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఆగస్ట్ నుంచి రూ.2.5 లక్షలతో..