MP Kesineni Nani: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎంపీ కేశినేని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైటెక్ సిటీ తానే కట్టానని చంద్రబాబు (Chandrababu) గొప్పలు చెప్పుకుంటున్నాడని విమర్శలు గుప్పించారు. హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసినది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని.. తరువాత అధికారంలో ఉన్న ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారం లాక్కున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: వైఎస్ చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే? సంచలన విషయాలు బయటపెట్టిన సునీత!
2019లో ప్రజలు ఒకసారి చంద్రబాబుకి బుద్ధి చెప్పారన్నారు. 2024లో కూడా ప్రజలు జగన్ మోహన్ రెడ్డిని (CM Jagan) గెలిపించి చంద్రబాబుకి మరోసారి బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. అరిచే కుక్కలు అరుస్తూనే ఉంటాయి వాళ్ల పనీ అరవడం మాత్రమే అని రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసన్నారు. అరిచే కుక్కలకి, మొరిగే కుక్కలకి సమాధానం చెప్పవలసిన అవసరం మాకు లేదని పేర్కొన్నారు. పేద ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని కామెంట్స్ చేశారు.
MP Kesineni Nani: ఈ ఎన్నికల్లోనూ జరిగేది ఇదే
ఈ ఎన్నికల్లోనూ ప్రజలు జగన్ మోహన్ రెడ్డిని గెలిపించి చంద్రబాబుకి మరోసారి బుద్ధి చెబుతారన్నారు ఎంపీ కేశినేని నాని. అరిచే కుక్కలకి, మొరిగే కుక్కలకి సమాధానం చెప్పవలసిన అవసరం తమకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.