Euro Exim Bank : ప్రకంపనలు సృష్టిస్తోన్న RTV కథనాలు.. Euro Exim Bankపై ఆర్థిక శాఖకు లేఖ!

యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఫేక్ గ్యారెంటీలు, దీంతో లబ్ధిపొందిన 'మేఘా' కాంట్రాక్టర్ల దోపిడిలపై ఆర్టీవీ వరుస కథనాలను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఎంపీ కార్తీ చిదంబరం ఈ అంశంపై లేఖ రాశారు.

New Update
Euro Exim Bank : ప్రకంపనలు సృష్టిస్తోన్న RTV కథనాలు.. Euro Exim Bankపై ఆర్థిక శాఖకు లేఖ!

Fake Guarantees : యూరో ఎగ్జిబ్ బ్యాంక్ (Euro Exim Bank) ఇస్తున్న ఫేక్ గ్యారెంటీల బాగోతాన్ని ఆర్టీవీ (RTV) ఆధారాలతో సహా బయటపెట్టిన విషయం తెలిసిందే. ఆ ఫేక్ గ్యారెంటీలతో బడా కాంట్రాక్టర్ల పేరుతో చెలామనీ అవుతోన్న 'మేఘా'  (MEGHA) బాబుల బండారాన్ని ఆర్టీవీ ప్రజలకు వివరించింది. ఈ దందాతో లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మిస్తున్న ప్రాజెక్టుల భవితవ్యం ఎలా ప్రశ్నర్థకం అవుతోందనే సంచలన నిజాలను ఆర్టీవీ ప్రసారం చేసింది. దీంతో రాజకీయ నాయకులు ఈ అంశంపై వరుసగా రియాక్ట్ అవుతున్నారు. ఎంపీ కార్తీ చిదంబరం ఈ విషయమై ఇప్పటికే ఆర్బీఐకి లేఖ రాశారు. దీంతో RBI విచారణ సైతం ప్రారంభించింది. తాజాగా ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఆయన లేఖ రాశారు.

సెయింట్ లూసియాలోని ఫైనాన్షియల్ సర్వీసెస్ రెగ్యులేటరీ అథారిటీచే నియంత్రించబడే యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లిమిటెడ్ పై పలు వివరాలను వెల్లడించడానికి ఈ లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ఇంగ్లాండ్, వేల్స్ చట్టాల ప్రకారం ఈ బ్యాంక్ పని చేస్తుందన్నారు. ఇలాంటి Euro Exim Bank Ltd ప్రభుత్వ కాంట్రాక్టులపై బిడ్డింగ్ చేసే సంస్థలకు బ్యాంక్ గ్యారెంటీలను అందజేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బ్యాంక్ గ్యారెంటీ మొత్తంలో 6 శాతం రుసుమును వసూలు చేస్తోందని తన దృష్టికి వచ్చిందని వివరించారు.

కొన్ని ప్రభుత్వ శాఖలు వివరాలను చెక్ చేయకుండానే ఈ హామీలను అంగీకరిస్తున్నాన్న రిపోర్ట్స్ ఉన్నాయని తెలిపారు. ఇది నిజమే అయితే.. ఆ హామీల విశ్వసనీయత గురించి తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. ఇది ప్రభుత్వ ప్రాజెక్టులు, ప్రజా నిధులను ప్రమాదంలో పడేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పద్ధతులు టెండరింగ్ ప్రక్రియ యొక్క విశ్వసనీయతను దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో ప్రమేయం ఉన్న ఆర్థిక సంస్థల విశ్వసనీయతను ప్రభావితం చేస్తాయన్నారు.

ఈ ఆందోళనల నేపథ్యంలో, సంబంధిత రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం బ్యాంక్ గ్యారెంటీలను జారీ చేయడానికి అవసరమైన అధికారాన్ని యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లిమిటెడ్ కలిగి ఉందో లేదో అన్న వివరాలను అభ్యర్థించాలని కోరారు. Euro Exim Bank Ltd జారీ చేసిన బ్యాంక్ గ్యారెంటీల చెల్లుబాటు, వాటిని అందించే బ్యాంకు అధికారం రెండింటిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఇందులో ఏమైనా అవకతవకలు గమనిస్తే.. టెండరింగ్ ప్రక్రియ యొక్క సమగ్రతను కాపాడటానికి, ప్రజా వనరులను రక్షించడానికి సత్వర దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read : ప్రకంపనలు సృష్టిస్తోన్న RTV కథనాలు.. Euro Exim Bankపై ఆర్థిక శాఖకు లేఖ!

Advertisment
Advertisment
తాజా కథనాలు