MP Avinash: వివేకా హత్య.. చీకటి ఒప్పందంతోనే అలా జరిగింది..అవినాష్ సంచలన వ్యాఖ్యలు..!

వైఎస్ షర్మిల, వైఎస్ సునీతా రెడ్డి వ్యాఖ్యలకు ఎంపీ అవినాష్ కౌంటర్ ఇచ్చారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు. చీకటి ఒప్పందంతోనే దస్తగిరిని అప్రూవర్ గా మార్చారని అన్నారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే సునీతా నడుస్తున్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు.

New Update
MP Avinash: వివేకా హత్య.. చీకటి ఒప్పందంతోనే అలా జరిగింది..అవినాష్ సంచలన వ్యాఖ్యలు..!

Kadapa MP Avinash: మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వైఎస్ షర్మిల, సునీతా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. వివేకా కేసులో చీకటి ఒప్పందం కుదిరిందన్నారు. వాచ్ మెన్ రంగన్న చెప్పిన పేర్లను విచారణ సంస్థ పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. ప్రత్యక్ష సాక్షి చెప్పిన సమాచారం మేరకు కేసు నడవలేదని కామెంట్స్ చేశారు.

ఎందుకు అడ్డుకోలేదు..

జులై 22న రంగన్న స్టేట్మెంట్ ఇస్తే నెల రోజుల తర్వాత దస్తగిరి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారన్నారు. తానే నరికి చంపానని చెప్పిన దస్తగిరిని అరెస్ట్ చేయరని.. అప్రూవర్ గా మారిన అని చెప్పిన వెంటనే దస్తగిరికి బెయిల్ ఇచ్చారన్నారు. అందరి బెయిల్ అడ్డుకునే మా సునీతా అక్క దస్తగిరి బెయిల్ ను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. చీకటి ఒప్పందంతోనే దస్తగిరిని అప్రూవర్ గా మార్చారని పేర్కొన్నారు.

Also Read: మదర్‌థెరిసా పాఠశాల దగ్గర ఉద్రిక్తత.. హనుమాన్‌ భక్తులు ఆందోళన..!

లొసుగులు అడ్డుపెట్టుకొని..

చట్టంలోని లొసుగులు అడ్డుపెట్టుకొని.. ముందస్తు బెయిల్ ఇప్పించి.. జైలుకు పంపకుండా హామీ ఇస్తే.. ఇష్టానుసారంగా పేర్లను చెప్తారన్నారు. ఇలాంటి అప్రూవల్స్ ద్వారా వాస్తవాలు బయటికి రావన్నారు. జులై 2020లో సీబీఐ ముందు సునీతా రెడ్డి వాంగ్మూలం ఇచ్చారని.. వాంగ్మూలం లో డ్రైవర్ ప్రసాద్ ఒక హంతకుడు అని వివరణ ఇవ్వడాన్ని నరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఫోన్ లో సునీతా అక్క చూశానన్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తర్వాత మాట మార్చి లెటర్ చూడలేదని సునీతా అక్క తప్పించుకుందన్నారు.


అనుమానం ఉంది..

మే 2023లో తనకు బెయిల్ వచ్చిందని.. తన బెయిల్ తర్వాత సీబీఐతో 13 సార్లు వాంగ్మూలం రికార్డ్ చేపించిందన్నారు. 2023 మే 31లో సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పమంటే తాను చెప్పాను అని చెప్పడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు డైరెక్షన్ లో సునీతా అక్క నడుస్తున్నారా అన్న అనుమానం ఉందని కామెంట్స్ చేశారు.

తప్పు చేయలేదు.. కాబట్టే

వివేకానంద రెడ్డి చివరి రోజుల్లో నిరాదరణకు గురయ్యారని.. రెండో ఫ్యామిలీ శమీమ్ కి వివేకా ఆస్తి పంచిస్తారన్న అనుమానం ఉందని పేర్కొన్నారు. రెండో ఫ్యామిలీ కి సహాయ నిరాకరణకు గురి చేసింది మీరా కాదా అనేది తెలుసుకోవాలన్నారు. రాం సింగ్ సునీతా కాంబినేషన్ కలిసిన తర్వాత లోపాలు కనిపించలేదా అని ప్రశ్నించారు. తాను తప్పులు ఎత్తి చూపిస్తే దాన్ని సునీతా రెడ్డి సీబీఐ కవర్ చేసుకుంటుందన్నారు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందని..తప్పు చేయలేదు కాబట్టి తాను ఏ రోజు కృంగిపోను అని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో నిజం బయటకు వస్తుందన్నారు.

Advertisment
తాజా కథనాలు