ఎన్నికలు (Elections) సమీపిస్తున్న వేళ..రాజకీయ నాయకులే కాదు..కొన్ని సంస్థలు కూడా వినూత్న రీతిలో వరాలు కురిపిస్తున్నాయి. కేంద్రం నవంబర్ నెలలో 5 రాష్ట్రాలకు ఎన్నికల నగరా మోగించిన వేళ..నాయకులందరూ కూడా ఎన్నికల కోసం తీవ్రమైన కసరత్తులు మొదలుపెట్టారు.
సాధారణంగా ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి వారికి చీరలు, సారెలు, మిక్సీలు, గ్రైండర్లు మొదలైన వాటిని బహుమతులుగా ఇస్తూ ఆకర్షిస్తుంటారు. కానీ మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో మాత్రం వారికి ఓ వెరైటీ ఆఫర్ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ముందుగా ఓటు వేసిన వారికి జిలేబీలు(Jilebi), పోహా (Poha)ఫ్రీగా ఇస్తామంటున్నారు కొందరు.అయితే ఈ ఆఫర్లు ప్రకటించింది ఏ రాజకీయ పార్టీనో, నాయకుడో కాదు.
Also read: ఆమె ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు..సుప్రీం కోర్టు!
ఓ ప్రముఖ ఫుడ్ హబ్. ఎన్నికలు అంటే ఉదయం 7 గంటలకే మొదలవుతాయన్న విషయం తెలిసిందే. కొందరు ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకుంటే..కొందరు మాత్రం తీరిగ్గా 10 గంటలు దాటిన తరువాత ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు వెళ్తుంటారు. అందుకే ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకునేలా ఓ ఫుడ్ హబ్ వినూత్న ఆఫర్ ను ఓటర్ల ముందుకు తీసుకుని వచ్చింది.
ఉదయం తొమ్మిది లోపు ఓటు వేయడానికి వచ్చిన వాళ్లకు పోహా, జిలేబీలు ఫ్రీగా ఇస్తామని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోని '' 56 దుకాణ్'' యజమానుల సంఘం ప్రకటించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నవంబర్ 17న మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా జరుగుతుంది.
దీంతో నవంబర్ 17 న ఉదయం తొమ్మిది లోపు ఓటు వేసి వచ్చిన వాళ్లందరికీ కూడా ఉచితంగా పోహా, జిలేబీలను ఇస్తామని 56 దుకాణ్ అసోసియేషన్ అధ్యక్షుడు గుంజన్ శర్మ తెలిపారు. ఈ ఆఫర్ నవంబర్ 17 ఉదయం 9గంటల వరకు మాత్రమే ఉంటుందని ఈ అవకాశాన్ని ఓటర్లు వినియోగించుకోవాలని కోరారు.