MP Arvind: బంగారం రేట్.. పసుపు రేట్ ఒకేలా ఉంది: ఎంపీ అరవింద్

జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వెంకట్‌ రెడ్డి గార్డెన్స్‌లో పసుపు రైతుల కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా ఎంపీ అరవింద్ హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ బీసీ కమిషన్ బోర్డు మెంబెర్ తల్లోజీ ఆచారి, రైతు నాయకులు, రైతు లు తదితరులు పాల్గొన్నారు.

New Update
MP Arvind: బంగారం రేట్.. పసుపు రేట్ ఒకేలా ఉంది: ఎంపీ అరవింద్

ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ ( MP Arvind )మాట్లాడుతూ.. పసుపు బోర్డు నా రాజకీయ భవిష్యత్ కు పునాది అని అన్నారు. ఇందూర్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే చక్కెర కర్మాగారం తెరిపిస్తామని అరవింద్‌ హామీ ఇచ్చారు. ఏడు నియోజకవర్గాల్లో బీజేపీ నుంచి గెలిసిన ఎమ్మెల్యేలు ఏ చిన్న అవినీతి చేసినా.. ఊరుకునేది లేదన్నారు. ఇందుకు తాను హామీ ఇస్తున్నానన్నారు. చక్కెర కర్మాగారంను ప్రైవేటీకరణ చేసింది అప్పటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆయన గుర్తు చేశారు. పసుపు బోర్డు తీసుకురావటం అసంభవం‌ అని అన్నారు. కానీ నరేంద్ర మోదీ తీసుకువచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ చిటకనవేలుతో తెరిపించటం ఎలా అంటే.. మధ్యప్రదేశ్‌లో చక్కెర కర్మాగారం తెరిపించామని గుర్తు చేశారు.

పసుపు ప్రపంచంలో ఎక్కువ పండేది భారతదేశం, ఎగుమతి చేసే దేశం భరతదేశమే అన్నారు. మోదీ సభ అద్భుతంగా జరిగిందన్నారు.1600 కోట్లు విలువ చేసే వస్తువులను ఎగుమతి చేస్తుందని ఎంపీ తెలిపారు. నాలుగున్నర సంవత్సరాలు ఎంపీగా తాను.. నాలుగు పైసల కరప్షన్ చేయలేదన్నారు. ఇంకా.. ఇరువై ఏళ్లు అయినా కరప్షన్ చేయను అని అన్నారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో మరో విషాదం..ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

Advertisment
తాజా కథనాలు