Breaking : సినీ లవర్స్ కి బ్యాడ్ న్యూస్.. 10 రోజులు థియేటర్స్ బంద్!

సమ్మర్ సీజన్ పూర్తయ్యే వరకు ఓ పది రోజుల పాటూ తెలంగాణా రాష్ట్రంలో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నట్లు తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు శుక్రవారం నుంచి పది రోజుల పాటూ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అనీ బంద్ కానున్నాయి.

New Update
Breaking : సినీ లవర్స్ కి బ్యాడ్ న్యూస్.. 10 రోజులు థియేటర్స్ బంద్!

Movie Theaters Closed In Telangana : సంక్రాంతి(Sankranti) తర్వాత సినిమాలకు అసలైన సీజన్ సమ్మరే. సమ్మర్(Summer) లోనే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతాయి. స్కూల్స్, కాలేజెస్ హాలిడేస్ కావడం, అలాగే ప్రతీ వీకెండ్ పేరెంట్స్ కూడా చిల్ అవ్వడానికి సినిమాలు చూసేందుకు థియేటర్స్ కి వస్తారు. అందుకే సినీ ఇండస్ట్రీ(Cine Industry)కి సమ్మర్ సీజన్ లోనే భారీగా కలెక్షన్స్ వస్తాయి. అటు స్టార్ హీరోలు సైతం ఈ సీజన్ లోనే తమ సినిమాలు రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. కానీ ఈసారి సమ్మర్ సీజన్ సినీ ఇండస్ట్రీకి భారీ ఎఫెక్ట్ ఇచ్చింది.

ఓవైఫు ఎలక్షన్స్, మరోవైపు ఐపీఎల్

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సమ్మర్ లో ఐపీఎల్(IPL) తో పాటూ ఎలక్షన్స్(Elections) కూడా రావడం సినిమాలకు ఇబ్బందిగా మారింది. అందుకే స్టార్ హీరోలు తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు. దాంతో కొన్ని చిన్న సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. కానీ వాటిని ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ లో చిన్న సినిమాలను చూసే జనాలే లేరు. ఓ పది నుంచి ఇరవై మంది వచ్చినా ఆ కలెక్షన్స్ రెంట్లు, కరెంట్ బిల్లులకే సరిపోవట్లేదు. అందుకే తెలంగాణా లోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అంతా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తాజా సమాచారం.

Also Read : ఊరమాస్ ఎలివెంట్స్ తో ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్.. ‘దిమాకిక్కిరికిరి’ అంటూ కుమ్మేసిన రామ్ పోతినేని!

పది రోజులు థియేటర్లు బంద్

సమ్మర్ సీజన్ పూర్తయ్యే వరకు ఓ పది రోజుల పాటూ తెలంగాణా రాష్ట్రంలో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నట్లు తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు శుక్రవారం నుంచి పది రోజుల పాటూ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అనీ బంద్ కానున్నాయి. దీంతో చిన్న సినిమాలకు ఇది కాస్త ఇబ్బందిగా మారనుంది. వచ్చే వారం రాజు యాదవ్, లవ్ మీ తో పాటూ మరికొన్ని చిన్న సినిమాలు విడుదలకు ఉన్నాయి. తాజా ప్రకటనతో ఈ సినిమాలన్నీ వాయిదా వేయక తప్పదు

Advertisment
Advertisment
తాజా కథనాలు