ShadNagar: పక్క ప్లాన్‌తో సినిమా స్టైల్‌లో మర్డర్

సినిమా స్టైల్‌లో మర్డర్ పక్క ప్లాన్ ప్రకారం ప్రాణం తీసిన కేసును పోలీసులు చేదించారు. మంగళవారం డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కరుణ కుమార్ మిస్సింగ్ అయ్యాడని తన సోదరుడు దీపక్ కుమార్ పీఎస్‌లో పిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

New Update
ShadNagar: పక్క ప్లాన్‌తో సినిమా స్టైల్‌లో మర్డర్

విస్తు పోయే విషయాలు

సినిమా స్టైల్‌లో మర్డర్ పక్క ప్లాన్ ప్రకారం ప్రాణం తీసిన కేసును పోలీసులు చేదించారు. మంగళవారం డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కరుణ కుమార్ మిస్సింగ్ అయ్యాడని తన సోదరుడు దీపక్ కుమార్ పీఎస్‌లో పిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పక్కా ప్లాన్ ప్రకారం హత్య

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని గత నెల (తేదీ 29/ 8 2023) రోజున కరుణ కుమార్ మిస్సింగ్ అయ్యాడని తన ఆన్న దీపక్ కుమార్ బీహార్ రాష్ట్రానికి చెందిన ఇతను కేశంపేట మండల పరిధిలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో మిస్సింగ్ పిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమకు తెలిసిన రంజిత్ కుమార్ అనే వ్యక్తి పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేయాలని ప్లాన్ ప్రకారం ఆగస్ట్‌ 15న కేశంపేట మండలంలోని నిడదవెళ్లి గ్రామం నుంచి జూలపల్లి వెళ్లే రోడ్డులో వరి చేను పొలం దగ్గరికి పిలిపించుకొని కాళ్లు చేతులు కట్టేసి వరి చేను నీటి బురద లో తలకాయ ముంచి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అదే బురదలో పాతిపెట్టి వెళ్లిపోయారు.

అరెస్టు చేసి రిమాండ్‌కు తరలింపు

అయితే.. రంజిత్ కుమార్ కూతురు విషయంలో కరుణ కుమార్ అసభ్యంగా ప్రవర్తించేవాడని తన కూతురు నుదుటిపై సింధూరం లాంటి బొట్టు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తమ పరువు ఎక్కడ పోతుందోనని హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులపై 302, 201 ,34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అరెస్టు చేసే రీమాండ్‌కు తరలించారు. ఈ హత్య కేసులో రంజిత్‌తో పాటు మంతోష్ కుమార్ దబ్లు కుమార్ అనే వ్యక్తులను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మొత్తం ఐదుగురు నిందితులు ఉండగా ఇద్దరు మైనర్లు కావడంతో వారి వివరాలను మీడియాకు చూపించని నేపథ్యంలో జువైనల్ హోమ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి షాద్‌నగర్ రూరల్ సీఐ లక్ష్మీరెడ్డి కేశంపెట్ మండల ఎస్సై వరప్రసాద్ తదితరులు ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు