Hyderabad : ఇండస్ట్రీలో విషాదం.. లేడీ ప్రొడ్యూసర్ ఆత్మహత్య!

సినీ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ మాదాపూర్‌లోని తన ఫ్లాట్‌లో ఉరివేసుకుని చనిపోయారు. రాజమండ్రికి చెందిన స్వప్న సినిమా అవకాశాల్లేక ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

New Update
Hyderabad : ఇండస్ట్రీలో విషాదం.. లేడీ ప్రొడ్యూసర్ ఆత్మహత్య!

Swapna Varma : టాలీవుడ్ ఇండస్ట్రీ (Tollywood Industry) లో విషాదం చోటుచేసుకుంది. సినీ ప్రొడ్యూసర్ (Producer) స్వప్న వర్మ ఆత్మహత్య చేసుకున్నారు. మాదాపూర్‌లోని తన ఫ్లాట్‌లో ఉరివేసుకుని చనిపోయారు. అయితే ఇంట్లోనుంచి డెడ్ బాడీ వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమె రెండు రోజుల క్రితమే ఉరివేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.

ఇక గతంలో పలు సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేసిన స్వప్న.. ఆరు నెలలుగా సినిమా అవకాశాలు లేకపోవడంతో ఒత్తిడికి లోనయింది. ఈ క్రమంలోనే తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్య (Suicide) చేసుకున్నట్లు సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. రాజమండ్రికి చెందిన స్వప్న వర్మ మూడేళ్ల క్రితం హైదరాబాద్‌ (Hyderabad) కు వచ్చినట్లు బంధువులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు వెల్లడించారు.

Also Read : ‘ఓ స్త్రీ మమ్మల్ని కాపాడు’.. భయపెడుతున్న ‘స్త్రీ 2’ టీజర్..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు