ఆ ముగ్గురిని ఆస్తి కోసమే చంపేశారు!

ఈ నెల 6 వ తేదీన జరిగిన మూడు హత్యల కేసులో నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారిని అరెస్ట్‌ చేసినట్లు కావలి డీఎస్పీ తెలిపారు. ఈ కేసు కు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియా ముందు వెల్లడించారు.

New Update
ఆ ముగ్గురిని ఆస్తి కోసమే చంపేశారు!

బోగోలు మండలం కొండబిట్రగుంట గ్రామంలో ఈ నెల 6 వ తేదీన జరిగిన మూడు హత్యల కేసులో నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారిని అరెస్ట్‌ చేసినట్లు కావలి డీఎస్పీ తెలిపారు. ఈ కేసు కు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియా ముందు వెల్లడించారు.

కొండబిట్రగుంటకు చెందిన రైల్వే ఉద్యోగి మందాటి మధుసూధన్‌ అనే వ్యక్తి కి తొమ్మిది సంవత్సరాల క్రితం మౌనిక అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే భర్త తాగుడుకు బానిసై మౌనికను చిత్ర హింసలు పెట్టేవాడు. దీంతో ఆమె పలుమార్లు పుట్టింటికి వెళ్లిపోవడం మళ్లీ ఆమెను తీసుకురావడం జరిగింది.

అయితే ఈ క్రమంలో ఆమెతో మామ కూడా అసభ్యంగా ప్రవర్తించడంతో వేరే కాపురం పెట్టారు.అయినప్పటికీ మామ, అత్త, మరిది మౌనిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె బాబుని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయి..అక్కడ బాబుని తల్లిదండ్రుల వద్ద విడిచిపెట్టి ఆమె చెన్నైలో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగంలో చేరింది.

ఈ క్రమంలో అత్తమామలు బాబుని తమ వద్దకు తీసుకుని రావడంతో వారి పై మౌనిక కిడ్నాప్ కేసు పెట్టింది. ఇదంతా ఇలా ఉంటే గత నెల 28 న మౌనిక భర్త మధు సూధన్‌ అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మౌనికతో పాటు ఆమె తండ్రి, అమ్మమ్మ కూడా వచ్చారు. అప్పటి నుంచి పెద్ద కర్మ అయ్యేంత వరకు వారు బిట్రగుంటలోనే ఉండేందుకు నిర్ణయించుకున్నారు.

దీంతో మౌనిక అత్తమామలు మౌనిక కేవలం ఆస్తిలో వాటాతో పాటు తమ కొడుకు మధు రైల్వే ఉద్యోగం కోసమే ఆమె ఇక్కడ ఉంటున్నట్లు భావించారు. దీంతో వారిని హతమార్చాడానికి నిర్ణయించుకున్నారు.

ఈ నెల 6 వ తేదీన వారిని రెండు ఇనుప రాడ్లు, ఓ కట్టెను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులైన మామ మాల్యాద్రి, అత్త ధనమ్మ, మరిది మౌళిచంద్ర లను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు