MOU For Two Pumped Storage Projects in Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ లో రెండు పంప్డ్ స్టోరేజి ప్రాజెక్ట్ ల ఏర్పాటుకు బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS Jagan) సమక్షంలో ఒప్పందం కుదరనుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ ఒప్పందం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (AP GENCO), కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) సంయుక్తంగా.. ఈ ప్రాజెక్టులను నిర్మించాలని నిర్ణయించాయి. నంద్యాల జిల్లాలోని యాగంటిలో 1000 మెగా వాట్లు., అనంతపురం జిల్లాలోని కమలపాడులో 1950 మెగావాట్ల సామర్థ్యంతో ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
రెండు పీఎస్పీలను సంయుక్త భాగస్వామ్యంలో నిర్మాణానికి రెండు సంస్థలు పరస్పరం అంగీకరించాయి. ఇందుకు సంబంధించి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయనున్నాయి. రెండు పీఎస్పీల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సమక్షంలో ఏపీ జెన్ కో, ఎన్ హెచ్పీసీ ప్రతినిధులు ఏపీజెన్‌కో, ఎన్‌హెచ్‌పీసీ (NHPC) ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. సరిసమాన భాగస్వామ్యంతో పీఎస్పీలు నిర్మించాలని ఏపీ జెన్ కో, ఎన్ హెచ్ పీసీ నిర్ణయం తీసుకున్నాయి.
విశాఖ పట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో (Global Investors Summit) సీఎం ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్ర ప్రదేశ్ ఇంధన శాఖ, ఏపీజెన్ కో పునరుత్పాధక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటుపై ప్రధానంగా దృష్టి సారించాయి. ఇందులో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పది పీఎస్పీల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని నెడ్ క్యాప్ ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏపీజెన్‌కో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి కూలంకుషంగా అన్ని అంశాలపై లోతుగా చర్చించి రాష్ట్రంలో కొత్తగా పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించింది.
Also Read: 8 వేల ఎకరాల్లో దేశంలోనే అతి పెద్ద సోలార్ పవర్ ప్లాంట్!