మోటరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటో ఎస్50 నియోను ఇటీవల చైనాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కంపెనీ నాలుగు సంవత్సరాల వారంటీని అందిస్తుంది.కొత్త స్మార్ట్‌ఫోన్‌లో కర్వ్డ్ POLED స్క్రీన్, 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో కూడిన స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి.
4 సంవత్సరాల వారంటీ:
Moto S50 Neo కంపెనీ Motorola 4 సంవత్సరాల వారంటీతో వస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ అని ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్‌తో కూడిన ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసినప్పుడు కంపెనీ ప్రకటిస్తుందో లేదో ఇంకా నిర్ధారణ లేదు.
Moto S50 నియో మొబైల్ స్పెసిఫికేషన్లు...
ఈ కొత్త Moto మొబైల్ 6.7-అంగుళాల pOLED కర్వ్డ్ డిస్‌ప్లేతో 1600నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ Snapdragon 6s Gen 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 12GB RAM, 512GB వరకు అంతర్గత నిల్వ ఎంపికలతో వస్తుంది. ఫోన్ 50MP ప్రైమరీ సెన్సార్ 8MP సెకండరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉంది. ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని పొంది ఉంది.
ధర వివరాలు…
Motorola తన కొత్త Moto S50 Neo మొబైల్‌ని మొత్తం 3 వేరియంట్‌లలో విడుదల చేసింది.
- 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,399 (భారతీయ పరంగా దాదాపు రూ. 16,000).
- 12GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,599 (భారతీయ పరంగా దాదాపు రూ. 18,400).
- 12GB RAM + 512GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,899 (భారతీయ పరంగా దాదాపు రూ. 21,800).
- మోటరోలా ఫోన్ గ్లోబల్ లేదా ఇండియన్ లాంచ్ పై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఈ S50 నియో మొబైల్ ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది.త్వరలో భారతదేశంలో లాంచ్ అవనున్నట్టు సమాచారం.