Motkupalli Narasimhulu: లోక్ సభ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) షాక్ ఇచ్చారు కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నరసింహులు. కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రేపు ఇదే అంశంపై ఒక్క రోజు దిక్ష చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) మాదిగ కులస్తులకు ఒక్క ఎంపీ టికెట్ ఇవ్వకపోవడం.. మాదిగ జాతిని అవమానించడమే అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో మాదిగ జాతి అణచివేతకు గురవుతుందని అన్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోత్కుపల్లి నరసింహులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.
ALSO READ: రేపు సుప్రీంలో ‘ఓటుకు నోటు’ కేసు విచారణ
సీఎం రేవంత్ ఒక్కో కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇప్పిచారని ఫైర్ అయ్యారు. తనకు ఎంపీ టికెట్ రాలేదని ఎలాంటి బాధ లేదని.. నా ఆవేదన మొత్తం మాదిగ జాతికి అభివృద్ధి కోసమే అని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మాదిగలకు రెండేసి టికెట్స్ ఇచ్చాయని.. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇచ్చిందని? ప్రశ్నించారు. అసలు తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించిందే మాదిగలను.. అలాంటిది 17 పార్లమెంట్ స్థానాల్లో ఒక్క మాదిగ కులానికి చెందిన అభ్యర్థి దొరకలేదా? అని రేవంత్ రెడ్డిని నిలదీశారు.
ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి ఏ కులామో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఆయన కూతురు ఓడిపోవడం పక్కా అని జోస్యం చెప్పారు. ఒక్కో కుటుంబలో ఇద్దరిదరికి టికెట్ ఇచ్చారు మాదిగ వాళ్లు ఎం పాపం చేశారని మోత్కుపల్లి అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి కావాలని కోరుకున్న వ్యక్తి ని తానని.. తన మాటకు రెస్పెక్ట్ లేదని.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తనకు ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.