Mother's Day : మదర్స్ డే స్పెషల్.. అమ్మ ప్రేమ అంతులేనిది..!

ప్రతీ సంవత్సరం మే నెల రెండవ ఆదివారం మదర్స్ డే జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే 12న మదర్స్ డే. అమ్మ ప్రేమకు, పిల్లల కోసం ఆమె చేసే నిస్వార్థమైన త్యాగాలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇది ఒక ప్రత్యేకమైన రోజు.

Mother's Day : మదర్స్ డే స్పెషల్.. అమ్మ ప్రేమ అంతులేనిది..!
New Update

Mother's Day Special : ప్రతీ ఒక్కరి జీవితం(Life)లో అమ్మ అనే పిలుపు ఒక అందమైన అనుభూతి. బ్రహ్మ సృష్టిలో మాతృ బంధం అద్భుతమైనది. అమ్మ ప్రేమను వర్ణించలేము. కనిపించే దైవం అమ్మ. జీవితంలో తల్లి ప్రేమను పొందడం ఒక గొప్ప వరం. పిల్లల కోసం తల్లి చేసే త్యాగం వెలకట్టలేనిది. ఇలాంటి గొప్ప మాతృమూర్తుల కోసం అంకితం చేయబడిన ప్రత్యేక రోజే మదర్స్ డే(Mother's Day). ప్రతీ ఏడాది మే నెలలో రెండవ ఆదివారం మదర్స్ డేను జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ సంవత్సరం మే 12న మదర్స్ డే.

మాతృ దినోత్సవం ప్రాముఖ్యత

పిల్లల పట్ల తల్లి చూపే అపారమైన ప్రేమ, వారి కోసం ఆమె చేసిన నిస్వార్థ త్యాగాలకు కృతజ్ఞతలు తెలియజేయడమే ఈ మాతృ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. స్త్రీల పట్ల కృతజ్ఞత, ఆప్యాయతలను వ్యక్తీకరించడానికి ఇది ఒక ప్రత్యేకమైన రోజు. సమాజంలో తమ పిల్లలను ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దడంలో తల్లి ముఖ్య పాత్ర పోషిస్తుంది. జీవితంలో తల్లి ఋణం ఎన్నటికీ తీర్చుకోలేనిది. అందుకే మాతృ దినోత్సవం రోజున పిల్లలు తమ తల్లికి ప్రత్యేకమైన అనుభూతిని కలిగించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు.

మదర్స్ డే వేడుకలు

మదర్స్ డే వేడుకలను వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు. కొన్ని దేశాల్లో పిల్లలు తమ తల్లులకు బహుమతులు, గ్రీటింగ్ కార్డ్స్(Greeting Cards), పువ్వులతో తమ హృదయపూర్వక సందేశాలను, ప్రేమను తెలియజేస్తారు. భారతదేశం(India)లో మాతృ దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున సమాజంలో స్త్రీ గొప్పతనాన్ని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

మదర్స్ డే చరిత్ర

17 వ శతాబ్దంలో ఇంగ్లాండ్(England) లో మాతృమూర్తులకు గౌరవంగా మదర్ సండే పేరిట ఉత్సవాలు జరిపే వారు. ఆ తర్వాత జూలియ వర్డ్‌ హోవే అనే ఒక మహిళ తొలిసారిగా అమెరికాలో ప్రపంచ శాంతి కోసం మదర్స్ డేని జరిపించారు. అలాగే అన్నా జార్విస్ అనే మహిళ కూడా మదర్స్ డే జరిపేందుకు ఎంతో కృషి చేశారు. అన్నా జార్విస్ అనే అమెరికన్ మహిళ తన తల్లి మరణించిన తర్వాత.. మాతృ దినోత్సవం కోసం ఎంత గానో ప్రచారం చేయడం జరిగింది. తల్లి జీవించి ఉన్నప్పుడే వారికి పిల్లలు కృతజ్ఞతలు తెలియజేయాలని ప్రజలను ప్రోత్సహించారు.

ఈ సారి మీ మదర్స్ ఇలా జరుపుకోండి 

తన రెక్కలు ముక్కలు చేసుకొని మనల్ని పెంచి పెద్ద చేసిన అమ్మ మన నుంచి ఆశించేది గుప్పెడంత ప్రేమ మాత్రమే. అలాంటి అమ్మకు ఏవో పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రత్యేకమైన రోజున కాస్త సమయం వాళ్ళ కోసం కేటాయించడం, వారి చిన్న చిన్న కోరికలను తీరిస్తే చాలు సంతోషపడతారు. ఈ సారి మదర్స్ డే రోజు మీ అమ్మను సర్ప్రైజ్ చేయడానికి ఈ ఐడియాస్ ట్రై చేయండి.

ఇష్టమైన ప్రదేశాలకు తీసుకెళ్లడం 

సాధారణంగా అమ్మలకు దైవభక్తి చాలా ఎక్కువ. వీలైనంత సమయం దైవ సన్నిధిలో గడపాలని కోరుకుంటారు. మీ అమ్మ కూడా పుణ్యక్షేత్రాలు దర్శించడం ఇష్టమైతే. ఈ స్పెషల్ డే రోజున ఆమెకు ఇష్టమైన దేవాలయాలకు తీసుకెళ్లి సర్ప్రైజ్ చేయండి చాలా సంతోషపడతారు.

గిఫ్ట్స్ 

జనరేషన్స్ మారుతున్న.. ఎప్పటికీ మారానిది అమ్మ పాత్ర. ప్రతీ రోజూ ఇంటి పని, వంట పని, పిల్లలతో కాస్త కూడా విశ్రాంతి లేకుండా గడిపేస్తుంటారు. ఇలాంటి సమయంలో ఇంటి పనుల్లో వారి శ్రమను తగ్గించడానికి వారి కోసం ఏదైనా హౌస్ హోల్డ్ ఎక్విప్మెంట్స్ గిఫ్ట్ గా ఇవ్వండి. ఉదా.. వాషింగ్ మెషిన్, వ్యాక్యూమ్ క్లీనర్, డిష్ వాషర్స్. దీని వల్ల కాస్తైనా వారి శ్రమను తగ్గించవచ్చు.

పాత జ్ఞాపకాలను గుర్తుచేయడం 

ప్రతీ ఒక్కరికి చిన్ననాటి జ్ఞాపకాలు ఎంతో మధురమైనవి. కావున ఈ స్పెషల్ డే రోజున మీ అమ్మకు తన చిన్ననాటి స్నేహితులను మరో సారి గుర్తుచేయండి. మీ అమ్మ స్నేహితులను పిలిచి ఆమెను సర్ప్రైజ్ చేయండి.

Also Read: Bitter gourd: ఇలా చేస్తే కాకరకాయలోని చేదు ఒక్క క్షణంలో పోతుంది..!

#india #life #mothers-day
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe