Crime: హైదరాబాద్ నగరంలో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ కీచక తల్లి డబ్బుల కోసం తన మైనర్ కూతురితో వ్యభిచారం చేయించిన ఘటన కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారంతో ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి రాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇనుప చువ్వలతో కాల్చి, జుట్టు కత్తిరించి..
ఈ మేరకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న లక్ష్మి కొంతకాలం క్రితం రోడ్డుమీద బతికే చిన్న ఆడిపిల్లను తీసుకొచ్చి పెంచుకుంది. అయితే కొంతకాలంగా బాగానే చూసుకున్న లక్ష్మీ.. ఈ మధ్య ఆ బాలికపట్ల సరిగా ఉండట్లేదు. డబ్బులకోసం ఆ బాలికను వ్యభిచారం చేయించేందుకు ప్లాన్ చేసింది. తిరస్కరించిన తనను ఇనుప చువ్వలతో కాల్చి, జుట్టు కత్తిరించి తీవ్రంగా కొట్టినట్లు బాధితురాలు తెలిపింది. చివరకు బలవంతంగా వ్యభిచారంలోకి దింపినట్లు బాలిక చెప్పినట్లు టాస్క్ ఫోర్స్ పోలీస్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: AP: అల్లు అర్జున్ నంద్యాల పర్యటన ఎఫెక్ట్.. ముగ్గురు పోలీసు అధికారులకు ఈసీ షాక్!
అయితే లక్ష్మిని వెంటనే అరెస్ట్ చేసి బాధితురాలిని రెస్క్యూ హోంకు తరలించినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే 'మీ చుట్టు జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించాలి' అని టాస్క్ ఫోర్స్ డీసీపీ సూచించారు.