Andhra Pradesh : ఏపీలో విషాదం.. ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకొడుకు మృతి నెల్లూరు జిల్లా కావలిలో ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతి చెందారు. కావలి పట్టణంలోని రైల్వే ట్రాక్ దాటే క్రమంలో ఆమె రైలును ఢీకొని మృతి చెందారు. రైలు రావడాన్ని గమనించకుండా ట్రాక్‌పైకి వెళ్లిన తల్లిని రక్షించే క్రమంలో కొడుకు కూడా మృతి చెందాడు. By B Aravind 12 May 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి Elections 2024 : నెల్లూరు(Nellore) జిల్లా కావలిలో విషాదం జరిగింది. ఎన్నికల విధులకు(Election Duty) వెళ్తూ తల్లీకుమారుడు మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సైదాపురం మండలం చాగనం గ్రామానికి చెందిన బి.సుభాషిణి (55) అనే మహిళ అంగన్వాడీ ఆయాగా పనిచేస్తున్నారు. ఎన్నికల అధికారులు ఆమెకు కావలిలో ఎలక్షన్ విధులు కేటాయించారు. ఈ క్రమంలోనే సుభాషిణి తన కొడుకు విజయ్(19)తో కలిసి బయలుదేరారు. Also Read: ఏపీలో రేపే ఎన్నికల సమరం.. ఏర్పాట్లు ఎలా చేస్తున్నారంటే? అయితే కావలి పట్టణంలోని రైల్వే ట్రాక్(Railway Track) దాటే క్రమంలో ఆమె రైలును ఢీకొని మృతి చెందారు. రైలు రావడాన్ని గమనించకుండా ట్రాక్‌పైకి వెళ్లిన తల్లిని రక్షించే క్రమంలో కొడుకు కూడా ప్రాణాలు కోల్పోయాడు. Also Read: చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎక్కడ ఓటు వేస్తారంటే? #telugu-news #lok-sabha-elections-2024 #ap-politics #election-duty మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి