Crime News: విషాదం.. తల్లి మరణ వార్త విని కొడుకు మృతి!! ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్న పేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. 24 గంటల వ్యవధిలోనే తల్లి, కొడుకు మృతి చెందారు. కన్న తల్లి మరణ వార్త విని కొడుకు మృతి చెందాడు. శుక్రవారం ఉదయం తల్లి ఆస్పత్రిలో మృతి చెందగా.. శనివారం సాయంత్రం తల్లి మరణం తట్టుకోలేక కొడుకు ఇంట్లోనే గుండెపోటుతో మరణించాడు.దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. By E. Chinni 20 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Mother and Son Died Within 24 hours in NTR District: ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్న పేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. 24 గంటల వ్యవధిలోనే తల్లి, కొడుకు మృతి చెందారు. కన్న తల్లి మరణ వార్త విని కొడుకు మృతి చెందాడు. శుక్రవారం ఉదయం తల్లి ఆస్పత్రిలో మృతి చెందగా.. శనివారం సాయంత్రం తల్లి మరణం తట్టుకోలేక కొడుకు ఇంట్లోనే గుండెపోటుతో మరణించాడు.దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. విస్సన్నపేట గ్రామంలో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఎదురుగా చంటి టైలర్ గా గుడ్డల వీరబాబుకు మంచి పేరుంది. అయితే వీరబాబు తల్లి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమె కొద్ది రోజులుగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. అయితే శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందింది. బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మాతృమూర్తి మరణ వార్త విన్న వీరబాబు ఇంటి వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కన్నతల్లి మరణించిన 24 గంటలలోనే (శనివారం సాయంత్రం) వీరబాబు గుండెపోటుతో మరణించాడు. 24 గంటల వ్యవధిలో తల్లి, కుమారుడు మరణించడంతో.. ఆ కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. తల్లీ, కొడుకు మరణంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపిస్తున్నారు. #mother-and-son-died-within-24-hours #son-died-after-mothers-death #ntr-district #andhra-pradesh #crime-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి