MotkuPalli: పదేళ్ల కేసీఆర్ కుట్రలకు తెలంగాణ ప్రజలు బలయ్యారు

మాజీ మంత్రి మోత్కు పల్లి నర్సింహులు ఈ రోజు తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్ జన రంజక అద్భుతమైన పాలన అందిస్తున్నారన్నారు. పదేళ్ల కేసీఆర్ కుట్రలకు తెలంగాణ ప్రజలు బలయ్యారని, ఇక కేసీఆర్ ఆటలు తెలంగాణలో సాగవన్నారు.

MotkuPalli: పదేళ్ల కేసీఆర్ కుట్రలకు తెలంగాణ ప్రజలు బలయ్యారు
New Update

MotkuPalli Narasimhulu: సీఎం రేవంత్ (CM Revanth) రెడ్డి జన రంజక అద్భుతమైన పాలన అందిస్తున్నారని మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నాయకులు మోతుకుపల్లి నర్సింహులు అన్నారు. ఈ మేరకు శనివారం తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మీడియా పాయింట్ లో విలేకరులతో మాట్లాడుతూ నెల రోజుల పాలన చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ఒరవడితో ముందుకు సాగుతుందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల మధ్యన ఉన్నదని భావనను కల్పిస్తుంది అన్నారు. భవిష్యత్తులోనే ఇదే వర్ని కొనసాగించాలని మేధావులు, ప్రజా సంఘాల నేతలతో సూచనలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలని కోరుకున్నట్లు తెలిపారు.

హామీలను నిలబెట్టుకుంటుంది..
అలాగే ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు రాత్రి, పగలు ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రజా పాలనలో తన వంతు పాత్ర నిర్వహిస్తానని స్పష్టం చేశారు. తన అనుభవాన్ని సలహాలను ప్రభుత్వానికి ప్రజలకు ఇవ్వడానికి తాను ఎప్పుడు సిద్ధమేనని అన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునేందు ప్రయత్నిస్తున్నాడని అన్నారు. కేసీఆర్ ఆటలు ఇక తెలంగాణలో సాగవని మొత్తం తెలంగాణలో పార్లమెంట్ సీట్లు అన్నీ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తెలంగాణ మాదిగలంతా ముక్త కంఠంతో కేసీఆర్ కు చరమగీతం పాడి కాంగ్రెస్ కు పట్టం కట్టారని గుర్తు చేశారు. ప్రజల కోసం పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వమని అని ఆయన ప్రశంసలు కురిపించారు.

ఇది కూడా చదవండి : Australian Open: లేటు వయసులో చరిత్ర సృష్టించిన రోహన్‌ బోపన్న

పదేళ్ల కేసీఆర్ కుట్రలు..
ఇక ప్రజల వద్దకు పాలనగా రేవంత్ ప్రభుత్వం నడుస్తుందని అన్నారు. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు కేసీఆర్ కుట్రలకు బలయ్యారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి పాలన సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త గిరెడ్డి ముకుంద రెడ్డి, హైకోర్టు అడ్వకేట్ సగరపు ప్రసాద్, తెలంగాణ యువ నాయకులు మాతంగి శ్రీనివాస్, జననేత జనతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

#cm-revanth #kcr #motakupalli-narasimhu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe