Testosterone: పురుషుల్లో మానసిక కల్లోలం.. టెస్టోస్టెరాన్ హెచ్చుతగ్గులే కారణమా!

పురుషుల్లో మానసిక ఆందోళన, చిరాకు, బద్ధకం, నిరాశ, ఒత్తిడికి టెస్టోస్టెరాన్ హార్మోన్ హెచ్చుతగ్గులే కారణమని అమెరికా వైద్యులు వెల్లడించారు. కొంతమంది మగాళ్లపై చేసిన అధ్యయనం ప్రకారం టెస్టోస్టెరాన్ అప్ అండ్ డౌన్స్ మానసిక, శారీరక స్థితిపై అధిక ప్రభావం చూపుతున్నట్లు కనుగొన్నారు.

New Update
Testosterone: పురుషుల్లో మానసిక కల్లోలం.. టెస్టోస్టెరాన్ హెచ్చుతగ్గులే కారణమా!

Testosterone: పురుషుల్లో టెస్టోస్టెరాన్ కు సంబంధించి శాస్త్రవేత్తలు ఆసక్తికర విషయం వెల్లడించారు. ఏ కారణం లేకుండానే తరచూ మానసిక కల్లోలం, చిరాకు పడటం వంటి లక్షణాలకు కారణం హార్మోన్ స్థాయిలో హెచ్చుతగ్గులేనని తెలిపారు. ముఖ్యంగా టెస్టోస్టెరాన్ కారణంగా ఈ సమస్య మరింత ఎక్కువగా తలెత్తుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైనట్లు పేర్కొన్నారు.

ఈ మేరకు ‘కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (California Institute of Technology) కొంతమంది పురుషులపై చేసిన పరిశోధనలో ఈ సమస్యను ‘ఇరిటెబుల్ మేల్ సిండ్రోమ్‌’(IMS)గా పేర్కొంది. ఈ సిచ్యువేషన్ మానసిక, శారీరక స్థితిపై అధిక ప్రభావం చూపుతున్నట్లు కనుగొన్నారు. మారుతున్న కాలానుగుణంగా సరైన ఆహారం తినకపోవడంతోపాటు, వ్యాయామం చేయకపోవడం, వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ ఇంబ్యాలెన్స్ కూడా ముఖ్య కారణాలుగా పేర్కొన్నారు. ఇక వ్యాధి లక్షణాలు వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంటాయని, రోగనిర్ధారణ కొన్నిసార్లు పూర్తిగా క్షీణించిపోతుందని చెప్పారు. ఈ పరిస్థితి కొంతమంది స్త్రీలు అనుభవించే ప్రీమెన్‌స్ట్రల్ సిండ్రోమ్ (PMS)కి సమానంగా ఉంటుందని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Namratha: మహేష్ ఫాలోయింగ్ పై నమ్రత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. మీరొక ఎమోషన్‌ అంటూ

లక్షణాలు :
అనుకోకుండానే మూడ్ స్వింగ్స్ లక్షణాలు కనిపించడం. ఉన్నట్టుండి ఇరిటేషన్ అధికమవడం. ఎనర్జీ ఫుడ్ తిన్నప్పటికీ తెలియని అలసట. ఊహించని రీతిలో లిబిడో తగ్గడం. మానవ సముహాలతోపాటు సన్నిహితులు మొత్తంగా సమాజానికి దూరంగా ఉండేందుకు మొగ్గు చూపడం. ఆలోచన బుద్ది మందగించడం. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఏకాగ్రత లేకపోవడం. మనకు తెలియకుండానే చిన్న చిన్న విషయాలకు ఆగ్రహం వ్యక్తం చేయడం. ఆ తర్వాత అదే విషయాన్ని రిపీట్ చేసుకుని ఆందోళన చేదడం వంటివి మనలో తారసపడుతుంటతాయని మానసిక నిపుణులు వెల్లడించారు.

పరిష్కారం:
ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి లక్షణాలు, మెడికల్ హిస్టరీ, ఈ సింప్టమ్స్‌కు కారణమయ్యే ఇంటర్నల్ ఇష్యూస్ గురించి విశ్లేషించి వివరణాత్మక సమాచారం తెలుసుకోవాలి. ఆ తర్వాత అతను ఎదుర్కొంటున్న సమస్యలనుంచి డైవర్ట్ చేయాలి. ఇందులో ముఖ్యమైనది ఫిజికల్ ఎగ్జామినేషన్. ఈ లక్షణాలను కలిగి ఉండే ఇతర కారణాలను తోసిపుచ్చడానికి, సాధారణ ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి శారీరక పరీక్ష నిర్వహించాలి. అలాగే హార్మోన్ టెస్ట్ చేయించాలి. కొన్ని సందర్భాల్లో హార్మోన్ స్థాయిలు, ముఖ్యంగా టెస్టోస్టెరాన్‌ లెవెల్స్‌ బ్లడ్ టెస్ట్ ద్వారా గుర్తిస్తారు. అయితే హార్మోన్ స్థాయిలు రోజులో మార్పుచెందే అవకాశం ఉంటుందని గమనించాలి. ఒక పరీక్ష ఎల్లప్పుడూ ఖచ్చితమైన రోగ నిర్ధారణను అందించదని గుర్తించి తగిన జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : Niharika Konidela: థాయ్‌లాండ్‌లో ఫుల్ గా ఎంజాయి చేస్తున్న నిహారిక.. మీరు ఓ లుక్కెయండి

జీవనశైలిలో మార్పులు గుర్తించి..
సైకలాజికల్ అసెస్‌మెంట్ తప్పనిసరి. ఎందుకంటే ఇది మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేయడంతోపాటు లక్షణాలకు దోహదపడే ఏదైనా అంతర్లీన మానసిక కారకాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ట్రీట్ మెంట్ కు సంబంధించి జీవనశైలి మార్పులు గమనించడం చాలా ఇంపార్టెంట్. ఇక ఆరోగ్యకరమైన జీవనశైలి సానుకూల ప్రభావాన్ని చూపుతుందని, సాధారణ వ్యాయామం, సమతుల్య ఆహారం, తగినంత విశ్రాంతి, ఒత్తిడి తగ్గించే పద్ధతులతోపాటు స్నేహితులతో సన్నిహిత్యం పెంచుకుంటే పాజిటివ్ రిజల్ట్ వస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (HRT) కూడా కొన్ని సందర్భాల్లో రక్త పరీక్షల ద్వారా తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలను గుర్తించినట్లయితే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ సిఫారసు చేయవచ్చు. HRT హార్మోనల్ బ్యాలెన్స్ రీస్టోర్ చేయడానికి సహాయపడుతుంది. టెస్టోస్టెరాన్ లెవల్స్‌ను సమతుల్యం చేస్తుంది.

Advertisment
తాజా కథనాలు