IMD : శుభవార్త చెప్పిన ఐఎండీ.. జూన్‌ ఒకటినే కేరళకు వస్తున్న రుతుపవనాలు!

భారత దేశ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. నైరుతి రుతుపవనాలు పురోగమించాయిని.. మే 19 నాటికి అండమాన్‌ నికోబార్‌ దీవులతో పాటు పరిసర ప్రాంతాలను తాకే అవకాశం ఉన్నట్లు ఐఎండీ ప్రకటించింది. జూన్‌ 1 నాటికి కేరళను తాకే అవకాశాలున్నట్లు ఐఎండీ వివరించింది.

New Update
Telangana : రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు!

Monsoon : భారత దేశ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. నైరుతి రుతుపవనాలు పురోగమించాయిని.. మే 19 నాటికి అండమాన్‌ నికోబార్‌ దీవులతో(Andaman Nicobar Islands) పాటు పరిసర ప్రాంతాలను తాకే అవకాశం ఉన్నట్లు ఐఎండీ(IMD) ప్రకటించింది. జూన్‌ 1 నాటికి కేరళను తాకే అవకాశాలున్నట్లు ఐఎండీ వివరించింది. జులై 15 నాటికి దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాలున్నాయని చెప్పింది. అయితే, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకున్నదాని కంటే ముందగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించింది.

గతవారం ఐఎండీ జూన్‌ ఒకటి లేదంటే ముందుగా మే 27న కేరళ(Kerala) తీరాన్ని తాకుతాయని అంచనా వేసింది.రుతుపవనాలు అండమాన్ మీదుగా కేరళను తాకుతూ వర్షాలను కురిపిస్తూ ముందుకు సాగుతాయని పేర్కొంది. వాస్తవానికి జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు రుతుపవనాల కాలం కొనసాగుతుంది. గతేడాది జూన్‌ రెండోవారంలో నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా కేరళను తాకాయి.

ఈ ఏడాది జూన్​ ఒకటి నాటికే అంటే సాధారణ సమయానికే కేరళను తాకే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇక రుతుపవనాల సీజన్‌లో వర్షాపాతం సాధారణం కన్నా ఎక్కువగానే ఉంటుందని ఐఎండీ ముందుగానే వెల్లడించింది. ఎల్‌పీఏలో 106శాతం వరకు వర్షాపాతం రికార్డయ్యే అవకాశాలున్నాయని చెప్పింది. నైరుతి రుతుపవనాల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని ఐఎండీ పేర్కొంది. అయితే, గతేడాది ఎల్‌పీఏలో 94.4శాతమే నమోదు చేసింది.

Also read: కాపురాన్ని కూల్చేసిన 5 రూపాయల కుర్కేరే!

Advertisment
Advertisment
తాజా కథనాలు