Mansoon : జూన్ మొదటి వారంలోగా తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు! జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు. మే నెలాఖారుకే కేరళను రుతుపవనాలు తాకనున్నట్లు అధికారులు వివరించారు. కేరళ నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణను చేరుకోవడానికి కనీసం అయిదారు రోజుల సమయం పడుతుంది. By Bhavana 22 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Mansoon Will Be Enter In Telangana : జూన్ మొదటి వారంలో తెలంగాణ (Telangana) లోకి నైరుతి రుతుపవనాలు (Mansoon) ప్రవేశించనున్నట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు. మే నెలాఖారుకే కేరళను రుతుపవనాలు తాకనున్నట్లు అధికారులు వివరించారు. కేరళ (Kerala) నుంచి ఏపీ (AP) లోని రాయలసీమ మీదుగా తెలంగాణను చేరుకోవడానికి కనీసం అయిదారు రోజుల సమయం పడుతుంది. అంటే 5-8 తేదీల మధ్య పవనాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణశాఖ అంచనా వేస్తుంది. అది కానీ ఆలస్యమైతే జూన్ రెండో వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణశాఖ నిపుణులు సూచిస్తున్నారు. గతేడాది కేరళకే జూన్ 11న వచ్చాయి. తెలంగాణలో విస్తరించే సమయం 20వ తేదీ దాటిన విషయం తెలిసిందే. మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండడంతో ఈ ఏడాది నైరుతి రుతువపనాలతో సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలున్నాయి. నైరుతి రుతుపవన గమనం ఆశాజనకంగా ఉందని జూన్ 11వ తేదీలోపే రాష్ట్రానికి వస్తాయన్న అంచనాలు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్త శ్రావణి వివరించారు. Also read: జూన్ 1 నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్! #telangana #rains #imd #alert #mansoon మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి