పదేళ్ల బాలుడిని క్రూరంగా చంపేసిన కోతులు.. కడుపులోంచి పేగులు లాగి

గుజరాత్‌ రాష్ట్రం గాంధీనగర్‌ జిల్లాలోని సాల్కి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పదేళ్ల బాలుడిపై గుంపుగా దాడిచేసిన కొతులు అతన్ని దారుణంగా చంపేశాయి. గోర్లతో చిన్నారి కడుపు చీల్చి, పేగులను బటయకు తీసి క్రూరంగా ప్రవర్తించాయి. ఈ విషాదకర వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

New Update
పదేళ్ల బాలుడిని క్రూరంగా చంపేసిన కోతులు.. కడుపులోంచి పేగులు లాగి

కోతుల మూకుమ్మడి దాడిచేసి పదేళ్ల బాలుడిని చంపిన ఘటన గాంధీనగర్ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. స్నేహితులతో ఆడుకుంటున్న పిల్లాడిపై ఒక్కసారిగా గుంపుగా అటాక్ చేయడంతో అక్కడికక్కడే మరణించాడు. అంతటితో ఆగకుండా క్రూరంగా ప్రవర్తించిన జంతువులు ఆ అబ్బాయిమీద కావాలనే ప్రతికారం తీర్చుకున్నట్లు వీరంగం సృష్టించాయి. ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది.

Also read : మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న జవాన్.. పదిరోజుల్లోనే ఘనత

ఈ మేరకు స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్‌ రాష్ట్రంలోని గాంధీనగర్‌ జిల్లాలోని సాల్కి గ్రామంలోని గుడి సమీపంలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం పదేళ్ల దీపక్ ఠాకూర్‌ తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అటుగా వచ్చిన ఒక కోతుల గుంపు అతడిపై దాడి చేసింది. ఆ బాలుడి మీదకు దూకిన కోతులు గోళ్లతో ఆ చిన్నారి కడుపు చీల్చి పేగులను బయటకు తీశాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి కోతుల దాడి నుంచి ఆ బాలుడ్ని రక్షించేందుకు ప్రయత్నించారు. అయినా పెద్దగా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత బాలుడిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పిల్లవాడు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో అతని తల్లిదండ్రులు బోరున విలపించారు. మరోవైపు ఆ గ్రామంలో జనంపై కోతులు దాడి చేయడం ఇది మూడో సంఘటన. కాగా ఈ నేపథ్యంలో గ్రామస్తుల ఆగ్రహంతో అటవీ శాఖ అధికారులు స్పందించారు.కోతులను పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామి ప్రజలకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ దారుణమైన వార్త హాట్ టాపిక్ గా మారింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు