Monkeypox in Pakistan: డేంజర్ బెల్స్.. పాకిస్థాన్ లో మంకీ పాక్స్! 

ఆఫ్రికా దేశాల్లో ఇప్పటికే బాగా విస్తరించిన మంకీ పాక్స్ ఇతర దేశాల్లోనూ వ్యాపిస్తోంది. దీంతో WHO గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. మొన్న స్వీడన్ దేశంలో ఒక పాజిటివ్ కేసు కనిపించింది. తాజాగా పాకిస్థాన్ లోనూ మూడు మంకీ పాక్స్ పాజిటివ్ కేసులు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. 

New Update
Monkey Pox : డేంజర్ బెల్స్.. పాకిస్తాన్ లో ఐదో మంకీ పాక్స్ రోగి

Monkeypox in Pakistan: ఇటీవల ఆఫ్రికా వెలుపల స్వీడన్ లో మంకీ పాక్స్ కేసు వెలుగులోకి వచ్చింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇంతలో మన పొరుగుదేశం పాకిస్థాన్ లో మూడు మంకీ పాక్స్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇది ఇప్పుడు ప్రపంచం అంతా డేంజర్ బెల్స్ మోగిస్తున్నట్టు కనిపిస్తోంది. భారత్ లో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియచేస్తోంది. వార్తా సంస్థ ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లోని ఆరోగ్య శాఖను ఉటంకిస్తూ రాయిటర్ ఇచ్చిన కథనం ప్రకారం పాకిస్థాన్ లో ముగ్గురు మంకీ పాక్స్ బారిన పడ్డారు. ఈ ముగ్గురూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుండి పాకిస్తాన్‌కు వచ్చినట్టు అక్కడి హెల్త్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. 

Monkeypox in Pakistan: డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ వ్యాప్తి చెందిన తర్వాత, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రెండేళ్లలో రెండవ సారి ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.  అది ఇతర దేశాలకు వ్యాపించిందని WHO తెలిపింది. అయితే, పాకిస్తాన్ గతంలో కూడా mpox కేసులను రిపోర్ట్ చేసింది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన కేసుల్లో ఏ వేరియంట్ ఉన్నదీ ఇప్పటికీ స్పష్టత రాలేదు.   

గురువారం అంటే ఆగస్టు 15న  స్వీడన్ తన మొదటి పాక్స్ వైరస్ కేసును రిపోర్ట్ చేసింది. ఆరోగ్యం -  సామాజిక వ్యవహారాల మంత్రి జాకోబ్ ఫోర్స్‌మెడ్ విలేకరుల సమావేశంలో స్వీడన్‌లో క్లాడ్ I అని పిలిచే అత్యంత తీవ్రమైన రకమైన మంకీ పాక్స్‌కు సంబంధించిన ఒక కేసు ఒకటి వెలుగులోకి వచ్చిందని ధృవీకరించారు. 

Monkeypox in Pakistan: వ్యాధి గ్రస్తులతో దగ్గర సంబంధాల ద్వారా వ్యాపించే Mpox, సాధారణంగా తేలికపాటిది కానీ అరుదైన సందర్భాల్లో మరణానికి దారితీయవచ్చు. వైరస్‌తో బాధపడుతున్న వ్యక్తి చర్మంపై ఫ్లూ వంటి లక్షణాలు,  చీముతో నిండిన గాయాలు కనిపిస్తాయి.

కాంగోలో వ్యాప్తి ప్రారంభంలో స్థానిక క్లాడ్ I జాతికి సంబంధించినది.  అయితే ఒక కొత్త రూపాంతరం, క్లాడ్ Ib వెలుగులోకి వచ్చింది. ఈ వేరియంట్ బురుండి, కెన్యా, రువాండా,  ఉగాండాలకు వ్యాపించింది. దీంతో WHO గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. "తూర్పు DRCలో కొత్త క్లాడ్ పాక్స్‌ను గుర్తించడం అది వేగంగా వ్యాప్తి చెందడం జరుగుతోంది.  ఇంతకుముందు mpoxని రిపోర్ట్ చేయని పొరుగు దేశాలకు కూడా ఇది వ్యాప్తి చెందడం అలాగే, ఆఫ్రికాలో, వెలుపల మరింత వ్యాప్తి చెందే అవకాశం చాలా ఆందోళన కలిగిస్తుంది" అని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్  బుధవారం తెలిపారు.

Also Read : వైసీపీ నేత దేవినేని అవినాష్‌కు బిగ్‌షాక్‌

Advertisment
తాజా కథనాలు