Mohan Babu : తిరుపతి లోని రామచంద్ర పుష్కరినిలో కోటి హనుమాన్ చాలీసా కార్యక్రమంలో పాల్గొన్నారు టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు. పారాయణ మహాయజ్ఞంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సీఎం జగన్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కొందరు బుద్ధిలేని హీనులు కులాలను చీలుస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. కులాలు అనేవి అవసరాల కోసం పెట్టుకున్నవేనన్నారు. వాటిని కొందరు రాజకీయాల కోసం కులాల మధ్య చీలికలు తెస్తున్నారని..కులాలు విడగొట్టడం బుద్ధి లేని వారి పనేనని పరోక్షంగా జగన్ ఉద్దేశించి వాఖ్యలు చేశారు.
Also Read: అక్కడికి రాముడొక్కడే కాదు.. వేలాది కోట్ల పెట్టుబడులు కూడా
ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ లాంటి నేత దేశానికి ఎంతో అవసరమన్నారు. మరోమారు మోదీ ప్రధాని కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఖచ్చితంగా మరోమారు మోదీ ప్రధాని కావడం ఖాయమని ధీమ వ్యక్తం చేశారు. మోడీ పాలనలో హిందూ సంప్రదాయాలతో వెలిగిపోతోందని..అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందిందని తెలిపారు. తను వెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దైవ సంకల్పం ఉంటే ఆయనే పిలిపించుకుంటారని.. అంతమంది భక్తుల మధ్య కష్టమే..కానీ..ప్రయత్నం చేస్తానంటూ వ్యాఖ్యనించారు.
Also Read: ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలంటూ మెగాస్టార్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానం!