టీమ్ ఇండియాలో ఏం జరుగుతోంది.. సిరాజ్ గుండె ఎందుకు పగిలింది!

ఇండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ షాకింగ్ పోస్ట్ తో క్రికెట్ లవర్స్ గుండెల్లో గుబులు రేపాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా హార్ట్ బ్రోకెన్ ఎమోజీలు కలిగి ఉన్న స్టోరీని పోస్ట్ చేయగా నెట్టింట దుమారం రేపుతోంది. ఇండియన్ టీమ్ లో ఏవో అంతర్గత కలహాలు మొదలయ్యాయని, బ్యాడ్ న్యూస్ రాబోతుందంటున్నారు.

New Update
టీమ్ ఇండియాలో ఏం జరుగుతోంది.. సిరాజ్ గుండె ఎందుకు పగిలింది!

టీమ్ ఇండియా యంగ్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ షాకింగ్ పోస్ట్ తో క్రికెట్ లవర్స్ గుండెల్లో గుబులు రేపాడు. ఏదో విషాద కరమైన వార్త తనకు చేరిందని, త్వరలోనే అందరికీ షాక్ తగలబోతున్నట్లు సిగ్నల్ ఇచ్చాడు. ఈ మేరకు ఇన్ స్టా వేదికగా గుండె పగిలిన సింబల్ పోస్ట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.

భారత క్రికెటర్లు ఒకరి తర్వాత ఒకరు ఇన్‌స్టాగ్రామ్‌లో రహస్య సందేశాలను పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్, బుమ్రా ఇలాంటి సిగ్నల్ తో ఫ్యాన్స్ ను గందరగోళంలో పడేయగా.. వారి అడుగుజాడలను అనుకరిస్తూ గురువారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఐదు హార్ట్ బ్రోకెన్ ఎమోజీలు కలిగి ఉన్న స్టోరీని పోస్ట్ చేశాడు మహ్మద్ సిరాజ్. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా ఫ్యా్న్స్ ఉలిక్కి పడ్డారు. ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఏదో జరుగుతోందని, త్వరలోనే ఈ ఇష్యూ బట్టబయలు కాబోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ ఇష్యూను ఇందులోకి లాగుతూ ఇండియా టీమ్ లోనూ ఏదో పెద్ద మార్పు జరగబోతుందని అంచనావేస్తున్నారు. మొత్తంగా భారత క్రికెట్ జట్టులో లుకలుకలు మొదలయ్యాయని, దీనికి కొంతమందే కారణమంటూ కామెంట్స్ చేస్తున్నారు.

publive-image

ఇది కూడా చదవండి : Mumbai Indians: ఎంత ఖర్మ పట్టిందిరా బాబు.. రోహిత్‌ ఫ్యాన్స్‌ దెబ్బకు ముంబై ఏం చేసిందో చూడండి!

ఇదిలావుంటే.. ఇటీవలే జస్ప్రీత్ బుమ్రా 'కొన్నిసార్లు నిశ్శబ్దం ఉత్తమ సమాధానం' అనే పోస్ట్‌తో సంచలనం రేపాడు. దీంతో కొంతమంది అభిమానులు ఇది RCB వేలంపై ప్రతిచర్య అని అంటుంటే.. మరికొందరు మొత్తం రోహిత్-హార్దిక్ పరిస్థితి కారణంగా ఇది జరిగిందని సూచించారు.

ఇక 29 ఏళ్ల సిరాజ్ ప్రస్తుతం భారత జట్టుతో దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. టీ 20 సిరీస్ ఆడిన సిరాజ్ మూడు-మ్యాచ్‌ల ODI సిరీస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ ఆడనున్నాడు. ఇక 2023 ప్రపంచకప్‌లో భారత్‌ అద్భుత ప్రదర్శన చేయడంలో సిరాజ్‌ కీలక పాత్ర పోషించాడు. కానీ ఫైనల్ లో ఆస్ట్రేలియా విజయం తర్వాత కన్నీరుపెట్టుకున్న సిరాజ్‌ను బుమ్రా ఓదార్చాడు. ఇక దురదృష్టవశాత్తూ, 2023 వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన మహమ్మద్ షమీ ఫిట్‌నెస్ సమస్యల కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారిగా టెస్టు సిరీస్‌ విజయం సాధించాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. బాక్సింగ్ డే టెస్ట్‌తో సెంచూరియన్‌లో ఈ సిరీస్ ప్రారంభంకానుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు