Vande Bharat : విశాఖకు మరో వందేభారత్‌..ఎప్పుడు ప్రారంభం అంటే!

ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి ఓ శుభవార్త ను తెలిపారు. ఏపీలో మరో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించనున్నారు.ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌- విశాఖ మధ్య వందే భారత్ రైలును సెప్టెంబర్ 16న మోదీ ప్రారంభించనున్నారు.

author-image
By Bhavana
New Update
VandeBharat: వందేభారత్ స్లీపర్ తొలి రైలు ఈ రూట్‌లోనే!

Vande Bharat :

భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఏపీకి ఓ శుభవార్త ను తెలిపారు. వినాయక నవరాత్రలును పురస్కరించుకుని ఏపీలో మరో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌- విశాఖ మధ్య వందే భారత్ రైలును సెప్టెంబర్ 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

ఐదు వందేభారత్ రైళ్లు...

ఏపీ మీదుగా ఇప్పటికే ఐదు వందేభారత్ రైళ్లు (Vande Bharat Trains) నడుస్తున్నాయి. తాజాగా ఆరో రైలు కూడా రాబోతుంది. ఇదే సమయంలో విశాఖపట్నానికి ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు నడుస్తుండగా.. ఇది మూడోది. 

మరోవైపు దుర్గ్- విశాఖపట్నం వందే భారత్ ట్రైన్‌ ఉదయం 5 గంటల 45 నిమిషాలకు దుర్గ్‌ జంక్షన్ నుంచి బయల్దేరనుంది. అనంతరం రాయ్‌పూర్ జంక్షన్, మహాసముంద్, ఖారియర్ రోడ్డు, కాంతబంజి, టిట్లాఘర్ జంక్షన్, కేసింగ, రాయగడ, విజయనగరం జంక్షన్ మీదుగా మధ్యాహ్నం 1.55 గంటలకు విశాఖ చేరుతుందది. అలాగే విశాఖపట్నం – దుర్గ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (20830) తిరిగి మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు విశాఖపట్నం స్టేషన్ నుంచి బయల్దేరి రాత్రి పది గంటల 50 నిమిషాలకు దుర్గ్ జంక్షన్ కు వస్తుంది.

Also Read :  వందే భారత్ రైలు రూఫ్‌ నుంచి కారిన నీరు

8 స్టేషన్లలో....

ఇక దుర్గ్ -విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 8 స్టేషన్లలో ఆగనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే 567 కిలోమీటర్ల దూరాన్ని 8 గంటల్లో చేరుకోనుంది. మరోవైపు ఏపీ నుంచి మరిన్ని వందే భారత్ రైళ్లు నడపాలనే ప్రతిపాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రయాణికుల నుంచి వస్తున్న అధిక డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మరిన్ని వందే భారత్ రైళ్లు తేవాలనే ప్రతిపాదనలు కూడా నడుస్తున్నాయి.

ముఖ్యంగా విజయవాడ- బెంగళూరు, విజయవాడ- ముంబయి మార్గాల్లో వందేభారత్ రైళ్లు నడపాలనే డిమాండ్లు ఉన్నాయి. అయితే విజయవాడ బెంగళూరు వందే భారత్ రైలు ప్రతిపాదనను పరిశీలిస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎప్పుడో తెలిపారు. అయితే విజయవాడ మంబయి మార్గంలో వందే భారత్ రైలు పగటిపూట నడపటం అసాధ్యమని అశ్వినీ వైష్ణవ్ తేల్చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడ బెంగళూరు వందే భారత్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read :  ప్రయాణికులకు అలెర్ట్.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 4 గంటలు ఆలస్యం

Advertisment
తాజా కథనాలు