Telangana : ఉజ్వల భవిష్యత్తు కావాలంటే మళ్లీ ఆయనే పీఎం కావాలి.. కిషన్ రెడ్డి కామెంట్స్ వైరల్

మూడోసారి కూడా దేశ ప్రధాని మోడీ కావాలని ప్రజలు కోరుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోడీ అవినీతి రహితపాలన అందిస్తున్నారని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశారని చెప్పారు. పిల్లలు, దేశ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం మళ్లీ ఆయనే పీఎం కావాలన్నారు.

Telangana : ఉజ్వల భవిష్యత్తు కావాలంటే మళ్లీ ఆయనే పీఎం కావాలి.. కిషన్ రెడ్డి కామెంట్స్ వైరల్
New Update

Kishan reddy: ప్రజలు మూడోసారి మోడీ (PM Modi) ప్రధాని కావాలని కోరుకుంటున్నారని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్‌ జిల్లాలో నిర్వహించిన విజయసంకల్ప యాత్రలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ అవినీతి రహితపాలన అందిస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ పదేళ్లలో 4 కోట్ల ఇళ్లు కట్టించటం జరిగిందన్నారు. దురదుష్టవశాత్తు తెలంగాణలో బీఆర్ఎస్ వైఖరి వల్ల ఇళ్ల నిర్మాణం ఆశించిన స్థాయిలో జరగలేదని అన్నారు. నిరుపేదలు వైద్య కోసం ఇబ్బందులు పడకుండా కేంద్రం చర్యలు చేపడుతుందన్నారు. పేదల కోసం మోడీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.

ఇద్దరూ దొంగలే..
'గతంలో తెలంగాణలో కేసీఆర్ కుటుంబం ఖానా.. పీయా.. చెలేగయా.. ఇప్పుడు తెలంగాణ సంపదను దోచుకుని లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోంది' అంటూ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో టెర్రరిస్టులు, ఉగ్రవాదులు పెట్రేగిపోయారన్నారు. నేడు ఉగ్రవాదాన్ని మోడీ ఉక్కుపాదంతో అణచివేయటంతో దేశం ప్రశాంతంగా ఉందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలనే విషయాన్ని జనాలు గమనించాలన్నారు. పిల్లల, దేశ ప్రజల ఉజ్వల భవిష్యత్ కోసం మోడీ మూడోసారి ప్రధాని కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో కరెంటు బిల్లులు కట్టవద్దని రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు దొంగ పార్టీలే, కుటుంబ పార్టీలే అంటూ కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

5,500 కిలోమీటర్ల యాత్రలు..
బీఆర్‌ఎస్‌-బీజేపీ పొత్తు అంటే ఎవరైనా దాన్ని తిప్పికొట్టాలనుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని, బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కిషన్‌రెడ్డి తేల్చిచెప్పారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు పోటీ చేసి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న బీజేపీకి.. మునిగిపోతున్న బీఆర్‌ఎస్‌తో కలవబోదని స్పష్టం చేశారు. గతంలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోలేదని గుర్తు చేశారు. కొందరు అక్రమార్కులు కుట్రపూరితంగా ఈ ప్రచారం చేస్తున్నారని, బుద్ధి లేని వ్యక్తులు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. మంగళవారం నుంచి రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో మొత్తం 5,500 కిలోమీటర్ల మేర పార్టీ ఆధ్వర్యంలో ‘విజయ సంకల్ప యాత్ర’ చేపట్టినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి : Medaram Jatara: రూ.299 చెల్లిస్తే మేడారం ప్రసాదం ఇంటికి!

ఐదు ప్రాంతాలనుంచి విజయసంకల్పయాత్ర..
కాగా బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏకకాలంలో ఐదు ప్రాంతాలనుంచి విజయసంకల్పయాత్రను ప్రారంభించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో కొమరంభీం విజయ సంకల్ప యాత్రను. అస్సాం సీఎం హిమంతభిశ్వశర్మ దీన్ని ప్రారంభించారు. భైంసా యాత్రలో ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, ఆరుగురు శాసనసభ్యులు పాల్గొన్నారు.ఈ యాత్ర 12 రోజుల పాటు 21 నియోజకవర్గాల్లో దాదాపు 1,056 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. రాజరాజేశ్వర విజయ సంకల్ప యాత్రను కేంద్ర మంత్రి బీఎల్ వర్మ తాండూరులో ప్రారంభించారు. కరీంనగర్, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో 1,217 కి.మీ. 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగనుంది.

21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో..
ఈ యాత్రలో ఎంపీ బండి సంజయ్‌ , మాజీ ఎంపీ విశ్వేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. భువనగరి, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో భాగ్యనగర్ విజయ సంకల్ప యాత్ర… ప్రారంభమైంది. యాత్రను గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ ప్రారంభించారు. ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యేలు రాజాసింగ్, వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా గ్రామం సమీపంలోని కృష్ణా నది వద్ద పూజలు చేసిన తర్వాత కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర ప్రారంభమైంది. మహబూబ్ నగర్‌ , నాగర్ కర్నూల్, నల్గొండ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో సాగనున్న ఈ యాత్రను కేంద్రమంత్రి పురుషోత్తం రూపగా ప్రారంభించారు. 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,440 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, నేతలు డీకే అరుణ, ఏపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. సమ్మక్క సారక్క జాతర కారణంగా కొన్ని రోజులు ఆలస్యంగా భద్రాచలంలో కాకతీయ భద్రకాళి విజయ సంకల్ప యాత్ర ప్రారంభమవుతుంది. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 21 నియోజకవర్గాల పరిధిలో 7 రోజుల పాటు 1,015 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది.

#third-time-prime-minister #bjp-kishan-reddy #pm-modi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి