Budget 2024: బడ్జెట్ కు ముందే మోదీ సర్కార్ గుడ్ న్యూస్...భారీగా తగ్గనున్న వీటి ధరలు..!! బడ్జెట్ కు ఒకరోజు ముందే మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో మొబైల్ విడిభాగాల దిగుమతిపై సుంకాన్ని కేంద్రం తగ్గించింది. ఈ దిగుమతి సుంకాన్ని 15శాతం నుంచి 10శాతానికి తగ్గించడంతో రానున్న రోజుల్లో సెల్ ఫోన్స్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. By Bhoomi 31 Jan 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Budget 2024: గురువారం ( ఫిబ్రవరి 1) న కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ (Interim Budget)ను ప్రవేశపెట్టనుంది. అయితే దీనికి ఒక రోజు ముందే మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)ఈ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. నిజానికి ఇది పూర్తిస్థాయి బడ్జెట్ కాదు. లోకసభ ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. అయితే ఈ మధ్యంత బడ్జెట్ లో కొన్ని అంశాలు కీలకంగా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎంతో మంది మధ్యతరగతి ప్రజలకు మేలు కలిగే విధంగా పన్ను స్లాబ్ ఉంటుందని అంతా భావిస్తున్నారు. అయితే బడ్జెట్ ప్రసంగానికి ఒక్కరోజు ముందు మోదీ సర్కార్ (Modi Govt) శుభవార్త చెప్పడం గమనార్హం. దేశంలో మొబైల్ విడిభాగాల దిగుమతిపై సుంకాన్ని కేంద్రం తగ్గించింది. ఈ ఎగుమతి సుంకాన్ని 15శాతం నుంచి 10శాతానికి తగ్గించడంతో రానున్న రోజుల్లో సెల్ ఫోన్స్ ధరలు(Cell Phone Prices) భారీగా తగ్గే అవకాశం ఉండచ్చొని తెలుస్తోంది. దీనిపై దేశంలోని మొబైల్ తయారీ పరిశ్రమ సంతోషం వ్యక్తం చేస్తోంది.కాగా 5జీ మొబైల్స్ వినియోగం భారీగా పెరిగింది. మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్స్ అతి తక్కువ ధరలో కొననేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ విడిభాగాల దిగుమతి(Import of Mobile Parts)పై సుంకాన్ని తగ్గించడం మొబైల్ ఫోన్ల ధరలు తగ్గేందుకు కీలక కారణమని చెప్పవచ్చు. ఇది మొబైల్ కొనాలనుకేవారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇది కూడా చదవండి: నిర్మలమ్మ బడ్జెట్ పై అంకుర పరిశ్రమల కోటి ఆశలు..వారి కోరికలు ఫలిస్తాయా? ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల(Made in India Electronic Products)ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు దోహదపడుతుందని నిపుణులు అంటున్నారు. మొబైల్ తయారీ వ్యాపారంలో చైనా (China), వియత్నాం వంటి దేశాల పోటీదారులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఇది మంచి నిర్ణయమని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ మధ్యంతర బడ్జెట్ (Budget 2024) లో సామాజిక రంగ పథకాలకు అధిక నిధులను కేటాయించే ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది. వ్యవసాయం ఆర్దిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా వినియోగ డిమాండ్ పెంచే కొన్ని చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించే ఛాన్స్ ఉందని సమాచారం. ఎన్నికల నేపథ్యంలో ఈసారిపూర్తిస్థాయి బడ్జెట్ బదులు మధ్యంతర బడ్జెట్ తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. #pm-modi #union-budget-2024 #budget-2024 #interim-budget #cell-phone-prices మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి