Pradhan Mantri Mudra Yojana Scheme: నేటికాలంలో చాలా మంది యువత ఉద్యోగాలు చేస్తూనే అదనపు ఆదాయం కోసం చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఇంకొంతమంది ఉద్యోగాలు మానేసి సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. మరికొంతమంది ఉన్న వ్యాపారాన్ని మరింత విస్తరిస్తున్నారు. అయితే వీటన్నింటికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. అందుకే చాలా మంది బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటారు. అందుకోసం ఎన్నోరకాల పత్రాలను బ్యాంకులకు సమర్పించాల్సి ఉంటుంది. లోన్ ఇవ్వాలంటే ఏదొక గ్యారెంటీ బ్యాంకుకు చూపించాల్సిందే. కొన్ని సందర్భాల్లో ఆస్తులను కూడా తాకట్టు పెట్టాల్సి వస్తుంది. అయితే ఇలాంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం కల్పించేందుకు సొంతంగా వ్యాపారం చేసుకునేవారిని ప్రోత్సహించేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ ముద్రా యోజనా పథకాన్ని (Mudra Yojana Scheme) అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా ఎలాంటి హామీ లేకుండానే రూ. 10లక్షల వరకు రుణాన్ని తీసుకోవచ్చు.'
ఇది కూడా చదవండి: రేషన్ కార్డు ఉన్న వారికి అలర్ట్..! ఈ విషయం తప్పక తెలుసుకోండి..!!
ముద్రా స్కీంను కేంద్రం 2015లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఎలాంటి పూచికత్తు అవసరం లేకుండా రూ. 50వేల నుంచి రూ. 10లక్షల వరకు రుణాలు తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈ లోన్ లో మీరు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ రంగ బ్యాంకులే కాకుండా ఇతర సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు , చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ సంస్థల నుంచి కూడా ఈ రుణాన్ని తీసుకోవచ్చు. అయితే ఈ లోన్ వడ్డీ రేటు పలు బ్యాంకులను బట్టి మారుతుంటుంది. సాధారణంగా బ్యాంకులు ఈ రుణంపై 10 నుంచి 12శాతం వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. ఆ రోజు ఆలయం మూసివేత.. కారణమిదే..!!
ఇక పీఎం ముద్రా స్కీం మొత్తం మూడు రకాలుగా ఉంటుంది. మొదటిది శిశు రుణం(Shishu Loan). ఇది మీరు మొదటిసారిగా వ్యాపారాన్ని ప్రారంభించట్లయితే సర్కార్ మీకు ఎలాంటి హామీ లేకుండానే ఐదేళ్ల టెన్యూర్ తో రూ. 50, 000వరకు లోన్ ఇస్తుంది. అలాగే రూ. 50, 000నుంచి రూ. 5లక్షల వరకు లోన్ తీసుకుంటే దానిని కిషోర్ లోన్ (Kishore loan) కేటగిరీ అంటారు. తరుణ్ లోన్ (Tarun Loan) కేటగిరీ కింద వ్యాపారాన్ని విస్తరించేందుకు సర్కార్ రూ. 5 నుంచి రూ. 10లక్షల వరకు లోన్ అందిస్తుంది. ఈ పథకంలో 24 నుంచి 70ఏళ్ల మధ్య వయస్సున్న భారతీయ పౌరులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. లోన్ అప్లికేషన్ కోసం ఆధార్, పాన్, పాస్ పోర్టు, అడ్రస్ ప్రూఫ్ మొదలైనవి సమర్పించాల్సి ఉంటుంది. ఈ స్కీం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే mudra.org.in అధికారిక వెబ్ సైట్ కు వెళ్లి ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో సమాచారాన్ని అంతా నమోదు చేసి మీ సమీపంలో ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకులో సమర్పించండి. అన్ని పత్రాలను పరిశీలించిన అనంతరం బ్యాంకు మీకు లోన్ అప్రూవ్ చేస్తుంది.