/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/modi-pv-sindhu.jpg)
PV Sindhu: పారిస్ ఒలింపిక్స్‌లో తొలిసారిగా దేశానికి ప్రాతినిధ్యం వహించబోతున్న భారత దళంలోని అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సంభాషించారు. ఈ క్రమంలో పీవీ సింధుతో ప్రధాని మోదీ వీడియో కాల్ ద్వారా చిట్ చాట్ చేశారు. కొత్తగా ఒలింపిక్స్‌లో (Olympics) ఆడుతున్న వారికి సలహాలు సూచనలు ఇవ్వాలని పీవీ సింధును మోదీ కోరారు. మొదటిసారి ఒలంపిక్స్ ఆడుతున్న వారికి చాలా టెన్షన్, భయంగా, నర్వస్ గా ఉంటుందని.. ఆ సమయంలో టెన్షన్ పడకుండా ఆడుతున్న ఆటపై ఫోకస్ గా ఉండాలని అన్నారు. ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే అది ఆటపై ప్రభావం చూపుతుందని పీవీ సింధు సూచించారు.
ప్రధాని మోడీతో పీవీ సింధుతో మాట్లాడుతూ.. "నేను ఒలింపిక్స్‌లో మూడవసారి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించబోతున్నాను. నేను 2016లో రజత పతకం, 2020లో కాంస్యం సాధించాను. ఈ ఏడాది పతకం రంగు మారుతుందని ఆశిస్తున్నాను, ఈ ఏడాది మరో పతకం సాధించాలని ఆశిస్తున్నాను" అని అన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi interacts with ace badminton player and two-time Olympic medalist, PV Sindhu says, "I am going to represent India for the third time in the Olympics. I won a Silver medal in 2016 and in 2020, I won a Bronze medal. I hope to change the colour… pic.twitter.com/SnBIoLfaM1
— ANI (@ANI) July 5, 2024
Also Read: విద్యుత్ బిల్లుల చెల్లింపులో క్యూ ఆర్ కోడ్ విధానం!