Big Breaking: రైతులకు మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఏకంగా రూ.8 వేల సాయం?

ప్రస్తుతం పీఎం కిసాన్ పథకం కింద ప్రతీ రైతుకు ఎకరాకు రూ.6 వేల చొప్పున అందిస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. ఆ మొత్తాన్ని రూ.8 వేలకు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లోనే ఈ అంశంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
PM Kisan Yojana: అన్నదాతలకు అలర్ట్..ఈరోజే అకౌంట్లో 17వ విడత డబ్బులు జమ.!

PM Kisan: కేంద్రలోని నరేంద్ర మోదీ సర్కార్ (Modi Government) రైతుల కోసం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని (Pradhan Mantri Kisan Samman Nidhi Scheme) తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ కింద ఎకరాకు రైతులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున అందిస్తోంది మోదీ ప్రభుత్వం. మొత్తం మూడు విడతలుగా రూ.2 చొప్పున ఈ మొత్తాన్ని అందిస్తున్నారు. మోదీ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చిన పథకాల్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. గత లోక్ సభ ఎన్నికల్లో ఈ పథకం బీజేపీకి ఓట్ల వర్షాన్ని కురిపించిందన్న విశ్లేషణలకు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ పథకం మొత్తాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందిస్తున్న రూ.6 వేలకు మరో రూ.2 వేలను కలిపి ఏడాదికి రూ.8 వేలు (8 Thousand Rupess) ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: BRS Election Promises 2023: గ్యాస్ ధర తగ్గింపు, పెన్షన్ల పెంపు.. బీఆర్ఎస్ సంచలన హామీలివే?

ఈ నిర్ణయంతో కేంద్రంపై అదనంగా ఏటా మరో రూ.20 వేల కోట్ల భారం పడనుంది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు, అనంతరం లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పీఎం కిసాన్ పథకం కింద అందించే ఆర్థిక సాయం పెంపు లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు బీజేపీకి (BJP) కలిసి వస్తుందని కేంద్ర భావిస్తోంది. ఈ మేరకు మరికొన్ని రోజుల్లోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Cars: దసరాకు కొత్త కారు కొంటున్నారా..? ఆ కారుపై ఏకంగా రూ.65 వేల భారీ డిస్కౌంట్!

ఇదిలా ఉంటే.. ఇప్పటికే 14 విడతల డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాగా.. త్వరలోనే 15వ విడత నిధులు విడుదల చేయనున్నారు. నవంబర్ 30లోపు 15 విడుత పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు