Modi Tour : మోదీ ఎలక్షన్ గిఫ్ట్‌.. ఏపీ సహా ఏడు రాష్ట్రాలకు రూ.34,676 కోట్లు.. నేడే శంకుస్థాపనలు!

అజంగఢ్‌లో ఇవాళ జరిగే మోదీ బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అజంగఢ్‌ నుంచి ఏపీ సహా దేశంలోని ఏడు రాష్ట్రాలకు రూ.34,676 కోట్ల విలువైన 782 అభివృద్ధి ప్రాజెక్టులను గిఫ్ట్‌గా ఇవ్వనున్నారు మోదీ. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన 744 ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి.

Surat MP Seat: బోణీ కొట్టిన బీజేపీ.. తొలి సీటు అక్కడే
New Update

Modi Gift For 7 States : సార్వత్రిక ఎన్నికల(Lok Sabha Elections) వేళ ప్రధాని మోదీ(PM Modi) దూకుడు పెంచారు. వరుస పెట్టి టూర్లు చేస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. ఈ రోజు అజంగఢ్ నుంచి ఏపీ(AP) సహా దేశంలోని ఏడు రాష్ట్రాలకు రూ.34,676 కోట్ల విలువైన 782 అభివృద్ధి ప్రాజెక్టులను బహుమతిగా ఇవ్వనున్నారు. ఇందులో రైల్వేలు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. మండూరి విమానాశ్రయం, అజంగఢ్, మహారాజా సుహెల్‌దేవ్ స్టేట్ యూనివర్శిటీలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మోదీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ఏపీ సహా ఏడు రాష్ట్రాలకు:
ఇవాళ(మార్చి 10) ఉదయం ప్రధాని అజంగఢ్(Azamgarh) చేరుకుంటారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల తర్వాత బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. పీఎంవో విడుదల చేసిన జాబితా ప్రకారం.. యూపీతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు ప్రధాని బహుమతులు అందించనున్నారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రూ.9,804 కోట్ల విలువైన 15 ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరగనుంది. 8,176 కోట్ల విలువైన భారతీయ రైల్వేకు చెందిన 11 ప్రాజెక్టులు కూడా మోదీ లిస్ట్‌లో ఉన్నాయి. జ‌ల శ‌క్తి మంత్రిత్వ శాఖ‌కు చెందిన రూ. 1,114 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టుల‌ను మోదీ ప్రారంభించ‌నున్నారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన ఐదు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. గృహనిర్మాణ, పట్టణ మంత్రిత్వ శాఖకు చెందిన రూ.264 కోట్ల విలువైన రెండు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన 744 ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి.

ఓడిపోయిన సీట్ల పై ఫోకస్:
కాశీ, అజంగఢ్ పర్యటన ద్వారా మోదీ బీహార్‌(Bihar) తో పాటు దక్షిణ భారతదేశ రాజకీయ సమీకరణాలపై దృష్టి పెట్టినట్టుగా అర్థమవుతుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని చవిచూడాల్సిన స్థానాల్లోని ప్రజల నుంచి మోదీ మద్దతు కోరనున్నారు. ఘాజీపూర్, మౌకీ ఘోసి, అజంగఢ్, లాల్‌గంజ్, జౌన్‌పూర్‌లలో కూడా బీజేపీ ఓడిపోయింది. అయితే ఉప ఎన్నికలో అజంగఢ్ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. అజంగఢ్‌లో జరిగే ఈ బహిరంగ సభ పూర్వాంచల్‌తో పాటు బీహార్ స్థానాలపై ప్రభావం చూపుతుంది.

Also Read : నేడే ‘సిద్ధం’ చివరి సభ.. 15లక్షల మంది వస్తారని అంచనా.. జగన్‌ ఎన్నికల మేనిఫెస్టోపై ఉత్కంఠ!

WATCH:

#pm-modi #bjp #narendra-modi #azamgarh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe