Modi : మోడీకి అమెరికా అధ్యక్షుడి నుంచి ఫోన్.. ఏ అంశాల గురించి చర్చించారంటే! భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ లతో పాటు..బంగ్లాదేశ్‌లోని హిందువుల పై దాడుల గురించి కూడా వారిద్దరూ చర్చించుకున్నట్లు మోడీ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. By Bhavana 27 Aug 2024 in ఇంటర్నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి PM Modi - Biden : భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) కి అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఫోన్ చేశారు. ఉక్రెయిన్-రష్యా యుద్దం (Ukraine - Russia War), బంగ్లాదేశ్‌లోని హిందువులతో పాటు మైనారిటీల భద్రత అంశాల పై మోడీతో బైడెన్ చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని ట్విటర్ వేదికగా తెలిపారు. రష్యాతో యుద్ధం చేస్తునన ఉక్రెయిన్ లో ఇటీవల మోడీ పర్యటించిన సంగతి తెలిసిందే. నేడు ఫోన్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో మాట్లాడా.. ఉక్రెయిన్‌లో పరిస్థితితో పాటు వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై వివరణాత్మక అభిప్రాయాలను ఇద్దరం చర్చించుకున్నాం. శాంతి, స్థిరత్వాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి భారత్ నుంచి సంపూర్ణ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ (Bangladesh) లో పరిస్థితిపై కూడా మా మధ్య చర్చకు వచ్చింది.. బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల భద్రతపై తాము చర్చించాం.. వీలైనంత త్వరగా బంగ్లాదేశ్‌లో సాధారణ స్థితిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్లు ప్రధాన మోడీ పేర్కొన్నారు. Also Read: ఈ నెల 31 వరకు భారీ వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరికలు! #pm-modi #america #joe-biden #ukraine #russia మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి