Divya Pahuja: మాజీ మోడల్ దివ్య పహుజా మృతదేహం లభ్యం.. ఎక్కడంటే!

ఈ నెల 2న గురుగ్రామ్‌లో హత్యకు గురైన మోడల్ దివ్య పహుజా మృతదేహం లభ్యమైంది. హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా తోహానా ప్రాంతంలోని కూడని హెడ్ కెనాల్‌లో డెడ్‌బాడీని NDRF కనుగొంది. వీపుపై ఉన్న టాటూ ఆధారంగా మృతదేహం ఆమెదేనని గుర్తించారు. ఈ విషయాన్ని గురుగ్రామ్ పోలీస్ డీసీపీ క్రైం ధృవీకరించారు.

Divya Pahuja: మాజీ మోడల్ దివ్య పహుజా మృతదేహం లభ్యం.. ఎక్కడంటే!
New Update

గురుగ్రామ్‌(Gurugram)లో మోడల్ దివ్య పహుజా(Divya Pahuja) హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. న్యూఇయర్‌ తర్వాతి రోజే ఈ హత్య జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక హత్య జరిగిన 11వ రోజు దివ్య మృతదేహాన్ని కనుగొన్నారు పోలీసులు. జనవరి 2న జరిగిన మోడల్ హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు పదకొండు రోజుల తర్వాత మోడల్ మృతదేహాన్ని కాలువ నుంచి స్వాధీనం చేసుకున్నారు. గురుగ్రామ్ మోడల్ దివ్య పహుజా మృతదేహాన్ని వెతకడానికి 25 మంది సభ్యుల ఎన్‌డీఆర్‌ఎఫ్(NDRF) బృందం పాటియాలా చేరుకుంది. గురుగ్రామ్, పంజాబ్ పోలీసులతో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం పాటియాలా నుంచి ఖనౌరీ సరిహద్దు వరకు కాలువలో మృతదేహం కోసం వెతికింది. చివరకు దివ్య పహుజా మృతదేహాన్ని హర్యానాలోని తోహానా కెనాల్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. దివ్య మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. గురుగ్రామ్ క్రైమ్ బ్రాంచ్‌లోని ఆరు బృందాలు మృతదేహాన్ని వెతకడంలో కృషి చేశాయి.

ఏం జరిగిందంటే?
జనవరి 2న గురుగ్రామ్‌లోని సిటీ పాయింట్ హోటల్‌లోని రూమ్ నంబర్ 111లో దివ్యని కాల్చి చంపేశారు. హోటల్ యజమాని అభిజీత్ సింగ్ మోడల్‌ను హత్య చేశాడు. ఈ కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాల్‌రాజ్ అనే నిందితుడిని విచారించిన హర్యానా పోలీసులు దివ్య పహుజా మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడంలో విజయం సాధించారు. దివ్య మృతదేహాన్ని హర్యానాలోని తోహనా కాలువలో పడేసినట్లు బాల్‌రాజ్ స్వయంగా పోలీసులకు సమాచారం అందించాడు. దివ్య పహుజా హత్యకేసులో ప్రధాన నిందితుడైన అభిజీత్ సింగ్ మృతదేహాన్ని పారవేసే బాధ్యతను అతని అనుచరుడు బాల్‌రాజ్ గిల్‌కు అప్పగించారు.

రూ.10లక్షలతో ప్లాన్:
బాల్‌రాజ్ దేశం విడిచి బ్యాంకాక్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు రవి బంగాను కోల్‌కతా విమానాశ్రయం నుంచి అరెస్టు చేశారు. బాల్‌రాజ్ గిల్ దివ్య మృతదేహాన్ని తన బాస్ అభిజీత్ బిఎమ్‌డబ్ల్యూ(BMW) కారు ట్రంక్‌లో ఉంచి, దానిని పారవేసేందుకు బయలుదేరాడు. ఈ పనిలో రవి బంగా అతనికి మద్దతుగా ఉన్నాడు. అభిజీత్ సింగ్ తన హోటల్‌లోని ఇద్దరు సిబ్బందితో కలిసి దివ్య మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, తన బీఎండబ్ల్యూ కారు ట్రంక్‌లో ఉంచి కాలువలో పడేశాడు. ఈ పని కోసం అభిజీత్ అతనికి రూ.10 లక్షలు కూడా ఇచ్చాడు. గురుగ్రామ్ క్రైమ్ బ్రాంచ్ ఈ హత్య కేసులో 6 మందిని నిందితులుగా పేర్కొంది. ఇందులో ప్రధాన నిందితులు అభిజీత్ సింగ్, హేమ్‌రాజ్, ఓం ప్రకాష్, మేఘా, బాల్‌రాజ్ గిల్ మరియు రవి బంగా పేర్లు ఉన్నాయి. వారందరినీ అరెస్టు చేశారు, దివ్య పహుజా (27) గురుగ్రామ్‌లోని బల్దేవ్ నగర్‌లో నివాసి.

Also Read: చైనాకు చెమటలు పట్టించే ఆయుధం.. సైన్యానికి DRDO నుంచి మరో అస్త్రం!

WATCH:

#crime-news #divya-pahuja
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe